Delhi hit-and-run: Father of teen driving the Mercedes arrested

Minor in rash driving case charged with culpable homicide

Mercedes hit-and-run case, Minor's father sent to police custody, business consultant, Mercedes car, manoj aggarwal, Delhi Police, 'repeat offender, act of criminal omission, Sidhharth Sharma, Sham Nath Marg, north Delhi's Civil Lines, CCTV footage

The father of a minor who killed a 33-year-old business consultant by hitting him with his speeding Mercedes car in Delhi three days ago was arrested

మైనర్ బాలుడి హిట్ అండ్ రన్ కేసు.. తండ్రిని అరెస్టు

Posted: 04/10/2016 10:37 AM IST
Minor in rash driving case charged with culpable homicide

మైనారిటీ తీరని కొడుక్కి కోట్ల ఖరీదైన కారు ఇవ్వడమే ఆ తండ్రి చేసిన తప్పైంది. కొడుకుపై చూపిన ఆ అతి ప్రేమే ఇప్పుడు ఆ తండ్రిని కటకటాల పాలు చేసింది. మైనర్ బాలుడు తన అవగాహనా రాహిత్యంతో చేసిన ప్రమాదం.. ఆయన తండ్రికి అరదండాలు వేయించింది. ప్రమాదం సంభవించిన తరువాత బాలుడు కారును నిలిపకుండా, ఇలా కొడుకు చేసిన తప్పుకు తండ్రి అరెస్టైన ఘటనకు మొన్న ఢిల్లీ నడి వీధుల్లో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసు వేదికగా నిలిచింది.

వివరాల్లోకెళితే... ఇటీవల ఢిల్లీ నడి వీధుల్లో మెర్సిడెజ్ బెంజ్ కారుతో ప్రత్యక్షమైన 17 ఏళ్ల మైనర్ బాలుడు వేగంగా డ్రైవ్ చేస్తూ రోడ్డు దాటుతున్న సిద్ధార్థ వర్మ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారును ఆపకుండానే ఆ బాలుడు ముందుకు దూసుకెళ్లాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఈ ప్రమాద దృశ్యాలను రికార్డు చేశాయి. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించిన పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

మృతుడి సోదరి నిన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను కలిసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా మైనారిటీ తీరని కొడుకు చేసిన ర్యాష్ డ్రైవింగ్ కారణంగా అతడి తండ్రి మనోజ్ అగర్వాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ అగర్వాల్ కొడుకు ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం ఇదే కొత్త కాదట. సదరు కారుపై ర్యాష్ డ్రైవింగ్ కు సంబంధించి గతేడాది రెండు కేసులు, తాజాగా ఈ ఏడాది మార్చి 3న మరో కేసు నమోదైందట. దీంతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన మైనర్ బాలుడికి బదులు బాలుడి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : business consultant  Mercedes car  manoj aggarwal  Delhi Police  repeat offender  

Other Articles