Shakespeare was a Jewish woman

Shakespeare was a jewish woman

Shakespeare, Shakespeare Novels, Jewish Woman

A Venetian Jewish woman who lived in London and spoke Hebrew is the actual author behind William Shakespeare, a leading expert claims in a book newly released in paperback.

షేక్స్ పియర్ పురుషుడు కాదు మహిళ

Posted: 04/05/2016 07:52 AM IST
Shakespeare was a jewish woman

హ్యామ్లెట్, ఒథెల్లో, మ్యాక్‌బెత్ లాంటి విషాధభరిత నాటకాలతోపాటు హాస్య, శృంగార నాటకాలతో, సమకాలీన కవిత్వంతో అశేష అభిమానులను కూడగట్టుకున్న ప్రపంచ ప్రసిద్ధ ఆంగ్ల రచయిత విలియమ్ షేక్‌స్పియర్. అయితే షేక్స్ పియర్ పురుషుడు కాదు మహిళ అని తెలుపుతూ జాన్ హడ్సన్ అనే రచయిత ఓ పుస్తకం రాశారు. షేక్‌స్పియర్ అసలు పేరు అమేలియా బస్సానో అని, ఆమె నల్లటి కురులు కలిగిన యూదు జాతి మహిళని, అమె వంశస్థులు క్వీన్ ఎలిజబెత్-1 కాలంలో సంగీత విద్వాంసులుగా పనిచేశారని జాన్ హడ్సన్ ‘షేక్‌స్పియర్స్ డార్క్ లేడీ’ పేరుతో రాసిన తాజా పుస్తకంలో వెల్లడించారు.

ఆమె లార్డ్ చాంబెర్లేన్ హెన్రీ కేరీని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. నాటి ఇంగ్లీష్ థియేటర్‌కు హెన్రీ కేరి ఇంచార్జిగా పనిచేశారని, అందుకనే ఆమె నాటకాలను అనేకం ఆ థియేటర్‌లో ప్రదర్శించారని చెప్పారు. క్రిస్టఫ్ మార్లోతో అమేలికి అక్రమసంబంధం ఉండేదని తన పుస్తకంలో హడ్సన్ తెలిపారు. అమేలీ 1645లో తుదిశ్వాస విడిచినట్లు హడ్సన్ తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakespeare  Shakespeare Novels  Jewish Woman  

Other Articles