Aishwarya Rai and Amitabh Bachchan in black money persons list

Aishwarya rai and amitabh bachchan in black money persons list

Aishwarya Rai, Amitabh Bachchan, Black money, Panama papers

From film stars Amitabh Bachchan and Aishwarya Rai Bachchan to corporates including DLF owner K P Singh and nine members of his family, and the promoters of Apollo Tyres and Indiabulls to Gautam Adani’s elder brother Vinod Adani. Two politicians who figure on the list are Shishir Bajoria from West Bengal and Anurag Kejriwal, the former chief of the Delhi unit of Loksatta Party.

బ్లాక్ మనీ జాబితాలో అమితాబ్, ఐశ్వర్య

Posted: 04/04/2016 11:41 AM IST
Aishwarya rai and amitabh bachchan in black money persons list

ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు సంబందించిన పనామా పేపర్స్  తాజాగా వెల్లడించిన వివరాలు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బ్లాక్ మనీ కలిగిన ప్రముఖుల పేర్లను డాక్యుమెంట్లతో సహా పనామా పేపర్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 మంది పొలిటీషియన్స్, పబ్లిక్ అఫిషియల్స్ లెక్కల్లో చూపించని ఆస్తులను పెంచుకుంటూ పోతున్నారని ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో బడాబడా వ్యక్తులనే చేర్చింది. ఐలాండ్ ప్రధాని, పాకిస్థాన్ అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్, సౌదీ అరేబియా రాజు పేర్లను ఈ జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో ఇండియన్ సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, రియల్టర్, కేపీ సింగ్, ఇండియన్ బుల్స్ యజమాని సమీర్ గెహ్లట్ తదితరులను ఈ జాబితాలో చేర్చింది.

సినీరంగంలో ప్రముఖంగా ఉన్న అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ లు కూడా బ్లాక్ మనీని కలిగి ఉన్నారిన పనామా పేపర్స్ వెల్లడించింది. ఐశ్యర్య రాయ్‌, ఆమె తండ్రి రమణరాజ్‌ కృష్ణరాయ్‌, తల్లి విందాకృష్ణ రాజ్‌ రాయ్‌, సోదరుడు ఆదిత్య రాయ్‌ డైరెక్టర్లుగా 2005లో ఎమిక్ పార్టనర్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. మొదట ఈ కంపెనీకి ఐశ్యర్య డైరెక్టర్‌గా ఉండగా, తర్వాత షేర్‌ హోల్డర్‌గా మారిపోయారు. 2008లో ఈ కంపెనీ రద్దయింది.

ఇక ప్రస్తుతం దేశానికి రాష్ట్రపతిగా అమితాబ్ బచ్చన్ కాబోతున్నారన్న వార్తల నడుమ బ్లాక్ మనీని ఆయన విదేశాల్లో కలిగి ఉన్నారన్న వార్త సంచలనం రేపుతోంది. విదేశాల్లో నాలుగు షిప్పింగ్ కంపెనీల్లో అమితాబ్ బచ్చన్ డైరెక్టర్‌గా ఉన్నట్టు ఈ పత్రాలు వెల్లడించాయి. ఇందులో ఒకటి బీవీఐలో ఉండగా, మరో మూడు బహమస్‌లో ఉన్నట్టు తేలింది. 1993లో స్థాపించిన ఈ కంపెనీల మూలధనం కేవలం 5వేల నుంచి 50వేల డాలర్లు కాగా, ఇవి చేసే ఓడల వ్యాపారం కోట్ల డాలర్లలో ఉండేది.మొత్తంగా పనామా పేపర్స్ వెల్లడించిన వివరాలు అందరికి షాకిస్తున్నాయి.

 

బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ లతో పాటు డీఎల్ఎఫ్ యజమాని కేపీ సింగ్, ఆయన 9 మంది కుటుంబ సభ్యులు, గౌతమ్ అదానీ, ఆయన సోదరుడు వినోద్ అదానీ, అపోలో టైర్స్, ఇండియా బుల్స్ ప్రమోటర్ల పేర్లు కూడా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కు చెందిన రాజకీయ నాయకుడు శిశిర్ బజోరియా, లోక్ సత్తా ఢిల్లీ విభాగం మాజీ చీఫ్ అనురాగ్ కేజ్రీవాల్, ముంబై గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చి (ప్రస్తుతం మరణించాడు)లు ఉన్నారు. ఐశ్వర్యా రాయ్, ఆమె తల్లిదండ్రులు, సోదరులు బ్రిటన్ లో 2005లో రిజిస్టరైన అమిక్ పార్ట్ నర్స్ లిమిటెడ్ లో డైరెక్టర్లని, ఆ సంస్థ ద్వారా బ్లాక్ మనీని నిర్వహించారని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai  Amitabh Bachchan  Black money  Panama papers  

Other Articles