They are trying to finish my political career

They are trying to finish my political career

Roja, MLA Roja, YSRCP, Chandrababu Naidu, AP, AP Assembly

YSRCP MLA RK Roja said that Chandrababu naidu govt trying to finish my political career. She also condemn chandrababu govt policies.

రాజకీయంగా నాశనం చేయడానికే: రోజా

Posted: 03/25/2016 01:55 PM IST
They are trying to finish my political career

రాజకీయంగా నన్ను నాశనం చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు నగరి ఎమ్మెల్యే రోజా.. హైదరాబాదు లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తనను రాజకీయంగా నాశనం చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏపీలో కలకలం రేపిన కాల్ మనీ సెక్స్ రాకెట్ లో టీడీపీ నేతలు ఉన్నారని, దానిపై చర్చకు డిమాండ్ చేయడమే తాను చేసిన తప్పని ఆమె వాపోయారు. సభలో అధికార పక్షం విపక్షం గొంతు నొక్కేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు.

రోజాను ఏం చేయబోతున్నారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని రోజా వెల్లడించారు. దీనంతటికీ కారణం ఏంటి అని ఆలోచించాలని ఆమె అన్నారు. అధికార పక్షానికి ఓట్లేసి, వాళ్లను అధికారంలో కూర్చోబెట్టేది వాళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని వాళ్లమీద ఒత్తిడి తేవడం కోసం ప్రతిపక్షం ఉంటుంది. కానీ టీడీపీ చేస్తున్న తప్పులు, సీఎం ఉన్న ఇంటి దగ్గరే, విజయవాడ చుట్టుపక్కల కాల్‌మనీ సెక్స్ రాకెట్ విజృంభించి, దానిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఏడాది సస్పెండ్ చేశారని రోజా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  MLA Roja  YSRCP  Chandrababu Naidu  AP  AP Assembly  

Other Articles