nellore brake inspector held with bribe at vijayawada toll gate

Brake inspector krishnaveni held for demanding bribe

break inspector, bribe, venkatachalam tollgate, nellore district, krishnaveni, break inspector husband, break inspector aunt, break inspector driver, krishnaveni denies bribe charges

nellore break inspector krishnaveni was arrested on the charges of forcing and demanding bribe from lorry

ఆమ్యామ్యాలపై ఆశ.. అత్తారింటి దారిని మార్చింది..

Posted: 03/21/2016 07:48 PM IST
Brake inspector krishnaveni held for demanding bribe

నిరుద్యోగులుగా వున్నప్పుడు నీతి నిజాయితీ గురించి బాగా బాషన్ లు ఇచ్చే వారు కాస్త ప్రభుత్వ ఉద్యోగులుగా జాబ్ లు దక్కగానే.. అన్ని అశయాలు, అధర్శాలు అంతర్థానమై.. కేవలం అమ్యామ్యాల పైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులందరిదీ ఒకే మాటా, ఒకే బాట కాబోలు. అందుకనే తన వ్యక్తిగత కార్యమై తమ అత్తారింటికి వెళ్తూ కూడా అమ్యామ్యాలను పొందాలనుకున్న కక్కుర్తి అమెను రూటు మార్పించి మరో అత్తారింటికి వెళ్లేలా చేసింది. అదెటా అంటారా..

వెంకటగిరిలోని తన అత్తగారింటికి భర్త, అత్తతో కలసి విజయవాడ నుంచి బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కృష్ణవేణి ఆదివారం బయలుదేరారు. సాయంత్రం 6.30గంటల సమయంలో వెంకటాచలం టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడకు గేదెలను చెన్నైకు తీసుకెళుతున్న మూడు లారీలు వచ్చాయి. వెంటనే బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కృష్ణవేణి కారుడ్రైవర్ ఆ లారీలను ఆపాడు. ఒక్కొక్కరు రూ.30 వేలు ఇవ్వాల్సిందిగా లారీడ్రైవర్లను డిమాండ్ చేశారు. వారు అంత ఇచ్చుకోలేమనడంతో కొంతసేపు వాదన జరిగింది. ఈ సమయంలో వెంకటాచలం ఎస్సై వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఎస్సైను చూసి బ్రేక్‌ఇన్‌స్పెక్టర్ కారును హడావుడిగా నెల్లూరువైపు యూటర్‌‌న తీయించారు. ఇది గమనించి ఎస్సై తన సిబ్బందితో కారును అడ్డగించి బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌ను, ఆమె భర్తను, అత్తను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే వారు లారీడ్రైవర్ల నుంచి తీసుకున్న రూ. 1,500ను కూడా స్వాధీనం చేసుకున్నారు. టోల్‌గేటు వద్దే కేసు నమోదు చేసి వారిని పోలీస్‌స్టేషన్ తరలించారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు రావడంతో ఎస్సై రాత్రి 10 గంటల వరకు ఈ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : break inspector  bribe  venkatachalam tollgate  nellore district  krishnaveni  

Other Articles