Amitabh Bachchan spent Rs 30 lakh for T20 match appearance, took no fee

Amitabh bachchan spent rs 30 lakh for t20 match appearance took no fee

Amithabh bachan, T20, national Anthem, India, Team India, Sourav Ganguly

Despite what haters will have you believe, Bollywood superstar Amitabh Bachchan did not take any appearance fee for singing the national anthem in the India-Pakistan World Twenty 20 clash, confirmed Cricket Association of Bengal (CAB) president Sourav Ganguly. On the contrary, Big B spent Rs 30 lakh from his pocket for the appearance.

దేశభక్తితోనే అమితాబ్ జాతీయగీతం పాడారు

Posted: 03/21/2016 04:04 PM IST
Amitabh bachchan spent rs 30 lakh for t20 match appearance took no fee

అమితాబ్ బచ్చన్.. ఆయన ఏ పని చేసినా దాన్ని డబ్బుతో ముడిపెడుతుంటారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ లో కోల్ కతాలో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ప్రత్యేక అతిథిగా పాల్గొని భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. అమితాబ్ మాత్రమే కాకుండా ఈ కార్యక్రమానికి అతిరథమహారథులు హాజరై భారత్ విజయాన్ని దగ్గరుండి వీక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని పక్కనపెడితే అమితాబ్ జాతీయగీతాన్ని ఆలపించడానికి 4కోట్ల రూపాయలు తీసుకున్నారని వార్తలు వచ్చాయి.


అయితే ఈ విషయం గురించి క్యాబ్ ప్రెసిడెంట్ భారత మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ ఈ విషయమై కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఇండియా-పాక్ మ్యాచ్ ప్రారంభంలో అమితా బచ్చన్ జాతీయ గీతాన్ని పాడారు. జాతీయ గీతం పాడినందుకు డబ్బులు తీసుకున్నారని కొందరు అవహేళన చేశారు. కొందరమే బిగ్‌బి పాడినందుకే ఇండియా టీమ్ ఘనవిజయం సాధించిందన్నారు. బెంగాల్ క్రికెట్ ఆసోషియోషన్ నుంచి బిగ్‌బి నాలుగు కోట్లు రూపాయలు తీసుకున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ విలేకరులతో మాట్లాడుతూ … అమితాబ్ దేశ భక్తితోనే జాతీయ గీతం పాడారని తెలిపారు. జాతీయ గీతం పాడటం కోసం తమ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. కోల్‌కతా రానుపోను విమాన టిక్కెట్లు, హోటల్ ఖర్చు అన్ని అమితాబ్ పెట్టుకున్నాడన్నారు. అమితాబ్‌ను ఎంత బలవంతం చేసినా దేశ భక్తితో పాడుతున్న పాటకు డబ్బులతో వేలకట్టలేమని అన్నారని సౌరవ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amithabh bachan  T20  national Anthem  India  Team India  Sourav Ganguly  

Other Articles