తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సభలో దురుసుగా ప్రవర్తించారు. కరువు మండలాలపై చర్చ జరగుతుండగా పోచారం వివరణ ఇస్తున్నారు. దీనిపై సంతృప్తి పడని జీవన్‌రెడ్డి ఆయన వద్ద ఉన్న పేపర్లలను మంత్రిపై విసిరారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కాగా తెలంగాణ అసెంబ్లీలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఏకంగా మంత్రి మీదకు కాగితాలు విసరడం మీద అధికారపక్షం మండిపడుతోంది.
మాజీ మంత్రి, కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి సభలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దగ్గరకు వెళ్లి పేపర్లను విసిరివేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనపై సభలో పెద్ద రగడే జరుగుతోంది. సభలో జీవన్‌రెడ్డి ప్రవర్తించిన తీరుపట్ల క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. ఈమేరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జీవన్‌రెడ్డి మంత్రి పట్ల అలా ప్రవర్తిస్తాడని ఊహించలేదన్నారు. దాదాపు మంత్రిపై దాడి చేసిన విధంగా ప్రవర్తించాడని మండిపడ్డారు. వెంటనే జీవన్‌రెడ్డి సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేశాకే జీవన్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. కరువుపట్ల చిత్తశుధ్ధి ఉంటే ప్రతిపక్ష సభ్యులు చర్చకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more