World T20: Indian women's team thrash Bangladesh by 72 runs

Indian women s team beats bangladesh in world twenty20 opener

icc world t20, world t20, icc womens world t20, womens world t20, india womens cricket team, india cricket team, india cricket, cricket

Indian women's cricket team produced a clinical performance as they thrashed their Bangladeshi counterparts by 72 runs in the opening group league fixture of the ICC World T20

టీమిండియా మహిళల శుభారంభం.. బంగ్లాపై 72 పరుగులతో విజయం

Posted: 03/15/2016 07:53 PM IST
Indian women s team beats bangladesh in world twenty20 opener

మహిళల ప్రపంచ కప్ టీ-20లో భారత్ బోణి కొట్టింది. తొలిమ్యాచ్లో బంగ్లాదేశ్పై 72 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. 164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 91 పరుగులే చేసింది.  బంగ్లా ఓపెనర్ క్రీడాకారిణి అయషా రహ్మన్ 2 పరుగులకే వెనుతిరగడంతో ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన సంజీదా ఇస్లాం, రుమన అహ్మద్, కౌతన్ వెను వెంటనే అవుటయ్యారు. మరో ఓపెనర్ షర్మిణ్ అక్తర్ 21, నిగర్ సుల్తానా 26 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో అనుజా పాటిల్, పూనమ్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు.  భారత బౌలర్ల దాటికి బంగ్లా క్రీడాకారిణులు పెవిలియన్కు క్యూ కట్టారు. తొలి నుంచి కూడా భాగస్వామ్యం నమోదు చేయడంలో బంగ్లా క్రీడాకారిణిలు విఫలమయ్యారు. దీంతో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు మిథాలీ రాజ్(42 ), వెల్లస్వామి వనిత(38)తో తొలి వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

తర్వాత దిగిన మందన డకౌట్తో నిరుత్సాహ పరిచిన హర్మాన్ ప్రీత్ కౌర్(40), వేద కృష్ణమూర్తి(36 నాటౌట్) నిలకడగా ఆడి టీమ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. బంగ్లా బౌలర్లలో రుమన అహ్మద్, ఫహిమా కౌతన్ రెండేసి వికెట్లు తీయగా నహిదా అక్తర్ ఒక వికెట్ తీసింది. తరువాతి మ్యాచ్ శనివారం ఢిల్లీలో మధ్యాహ్నం 3.30గంటలకు భారత్ క్రీడాకారిణిలు పాకిస్తాన్తో తలపడనున్నారు. అదే రోజు ధర్మశాలలో సాయంత్రం 7.30 ని.లకు భారత్ పురుషుల జట్టు, పాకిస్తాన్ జట్టుతో ఆడనున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles