abhishek nagar wrote a letter to president pranab mukherjee

Accident victim s son writes letter to president pranab seeking action against union minister smriti

president pranab mukharjee, yamuna expressway accident, Victim son, Court to move over Yamuna Expressway deaths, smriti irani, smriti irani accident, yamuna expressway accident, Yamuna Expressway deaths, victim's family claims Smriti didn't help, HRD Ministry denies charge,

After the family of a man who died in an accident on Yamuna expressway, the victim's son writes letter to president pranab seeking action against union minister Smriti irani

కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి పిర్యాదు..

Posted: 03/11/2016 08:55 AM IST
Accident victim s son writes letter to president pranab seeking action against union minister smriti

యమునా ఎక్స్ ప్రెస్వేపై ఈ నెల 5న శనివారం రాత్రి జరిగిన ప్రమాదానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాన్వాయే కారణమని, తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూలో ప్రమాదంలో మృతిచెందిన బాధితుడి కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఆగ్రాకు చెందిన వైద్యుడు రమేష్ నగర్ మృతి చెందగా, పలువురు చిన్నారులు గాయపడిన విషయం తెలిసిందే. అయితే స్మృతి ఇరానీ కాన్వాయ్ కారు రెండు పర్యాయాలు తమ తండ్రి వాహనాన్ని ఢీ కోనడంతోనే ఆయన మరణించాడని, లేని పక్షంలో ఆయన బతికేవారని మృతుడి కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి స్మృతి ఇరానీ పై చర్య తీసుకోవాలని మృతిచెందిన డాక్టర్ కుమారుడు అభిషేక్ నగార్ తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని  అభిషేక్, ప్రణబ్ ను కోరాడు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రమాదానికి జరిగిన తన కాన్వాయ్ డ్రైవర్ ను పూర్తిగా ఘటన నుంచి తప్పించేందుకు మంత్రి హోదాలో యత్నిస్తున్నారని అరోపించారు. అసలు ప్రమాదానికి, కేంద్ర మంత్రి కాన్వాయ్ కు ఎలాంటి సంబంధంలేదని పోలీసులు కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శణమని పేర్కోన్నారు.

తమ ఫిర్యాదులో కాన్వాయ్ నెంబర్ పేర్కొన్నప్పటికీ మథుర పోలీసులు అందుకు నిరాకరించారని రాష్ట్రపతికి రాసిన లేఖలో అభిషేక్ పేర్కొన్నాడు.  ఆ వాహనం నెంబర్ డీఎల్ 3సీ బీఏ 5315 (DL 3C BA 5315) అని వెల్లడించాడు. తన తండ్రి ఓ వివాహానికి బైక్ పై వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో తన కూతురు సాందిలి(12), మరో చిన్నారి పంకజ్(8) గాయపడ్డారని వివరించాడు. మంత్రి కాన్వాయ్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, స్మృతి ఇరానీ ఆ గాయపడ్డ ఇద్దరు చిన్నారులను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయిందని తమకు న్యాయం చేయాలని తన లేఖలో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smriti irani  president pranab mukharjee  yamuna expressway accident  Victim son  

Other Articles