తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యారు. మూడింట రెండొంతులకు పైగా ‘చీలిపోయామని’, తమను టీఆర్‌ఎస్‌లో కలిపేయాలన్న ఆ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పరిగణనలోకి తీసుకున్నారు. వారిని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న రాత్రి తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జి.సాయన్న, టి.ప్రకాశ్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కె.పి.వివేకానంద, చల్లా ధర్మారెడ్డి, ఎస్.రాజేందర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీలను ఇక నుంచి టీఆర్‌ఎస్‌ఎల్పీ సభ్యులుగా పరిగణిస్తారు.
టీడీపీని వదిలిపెట్టి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల విలీనానికి స్పీకర్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో వారిపై అనర్హత వేటు పడే ప్రశ్న ఉత్పన్నం కాబోదు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా లేఖ కూడా ఇప్పుడు ఉనికి కోల్పోతుంది. అయితే, టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తమను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని కోరినప్పుడు, అది చట్ట సమ్మతం అవుతుందా? కాదా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, తమను టీఆర్‌ఎ్‌సలో విలీనం చేయాలంటూ గతంలో టీడీపీ ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేసినప్పుడు అప్పట్లో వారి విజ్ఞప్తిని మండలి చైర్మన్ మన్నించిన చరిత్ర ఉంది. ఇప్పుడు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో సాగారు. తాజా విలీనంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 78కి చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more