mrps viswaroopa yatra in chandrababu native naravari palle

High tension in ap cm chandrababu native

high tension, high tension in naravaripalle, high tension in chandrababu native, manda krishna madiga arrest, chandrababu native, naravari palle, mrps, viswaroopa yatra, manda krishna madiga

high tension arose in andhra pradesh chief minister native naravari palle as mrps to conduct vishwaroopa yatra in the leadership of manda krishna madiga

చంద్రబాబు స్వగ్రామంలో హైటెన్షన్..! అడుగడుగునా పోలీసుల మోహరింపు

Posted: 03/10/2016 09:16 AM IST
High tension in ap cm chandrababu native

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంతూరు... చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో హైటెన్షన్ వాతారణం నెలకొంది. నారవారిపల్లెలో ముఖ్యమంత్రి సహా అతని కుటుంబం బస చేసినా లేని భద్రత, పోలీసుల పహారా అలుముకోవడంతో స్థానికలలో తీవ్ర ఆందోళన నెలకొంది. నిన్న సాయంత్రం నుంచే పోలీసు ఆంక్షలు (పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్) అమల్లోకి వచ్చేశాయి. గ్రామంలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు అంగుళం అంగుళం అందోళనకారులను అన్వేషిస్తున్నాయి. గ్రామంలోని ఇంటింటిని సోదా చేస్తున్నాయి.

ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ... నారావారిపల్లె నుంచి ఇవాళ విశ్వరూప యాత్రను  ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో నిన్న రాత్రే మంద కృష్ణ మాదిగను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు గుంటూరు తరలించారు. అయితే తమ ఉద్యమ నేత మందకృష్ణను అరెస్టు చేసినా.. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు యాత్రను నిర్వహించి తీరతామని ఎమ్మార్పీఎస్ నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు అప్పటికే గ్రామంలో ప్రవేశించి ఉంటారన్న అనుమానాలతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. దీంతో నారావారిపల్లెలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high tension  chandrababu native  naravari palle  mrps  viswaroopa yatra  manda krishna madiga  

Other Articles