West Bengal Horror: Girl jumps from second floor to escape rape

Woman jumps off second floor of building to escape rape in howrah

Girl jumps from second floor to escape rape, Howrah, Howrah general hospital, friend, rape attempt, rape, gangrape, West Bengal, harassment on women, rape on women, attrocities on women, crime news

Girl jumps from second floor to escape rape attempt on her ... on her head and face, and has been admitted to the Howrah General Hospital.

నయవంచకుడు గ్యాంగ్ రేప్ కు యత్నిస్తే.. రెండో అంతస్థు నుంచి దూకిన యువతి

Posted: 03/07/2016 10:20 AM IST
Woman jumps off second floor of building to escape rape in howrah

తన మిత్రుడని నమ్మి వస్తే.. అతని మిత్రులతో కలసి తనపై అత్యాచారం చేసుందుకు యత్నించిన నయవంచకుడిని ఎదుర్కోన లేక.. అత్యాచార యత్నం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ 20 ఏళ్ల యువతి భవనం రెండో అంతస్థు నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా సమీపంలోని హౌరాలో ఆదివారం సాయంత్రం జరిగింది. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన వివరాలు సేకరించి... యువతిపై అత్యాచారానికి యత్నించిన బాయ్‌ఫ్రెండ్‌, అతడి ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు.

నిన్న యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి అతడి ఇంటికి వెళ్లింది. అయితే అక్కడ అతడితో పాటు మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారు ఆమెకు మత్తుకలిపిన డ్రింక్‌ ఇచ్చారు. అనంతరం అత్యాచార యత్నానికి ప్రయత్నించగా ఆమె అడ్డుకుని కేకలు వేసింది. దీంతో వారు ఆమెను చంపడానికి ప్రయత్నించగా.. పరిగెత్తుకుంటూ బాల్కని నుంచి కిందకు దూకేసిందని పోలీసులు వెల్లడించారు. ఆమె దూకడం గమనించిన స్థానికులు వేగంగా స్పందించి యువతిని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు యువకులను పట్టుకుని తమకు అప్పగించినట్లు పోలీసుల తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Howrah  rape  gangrape  West Bengal  crime news  

Other Articles