Setback for Sujana Chowdary by Hyderabad High Court

Sc dismisses plea sujana s firm faces liquidation

supreme court, set back to sujana, union minister, histia, sujana univesal industries, maritius, high court, sujana chowdary, maritius commercial bank

Setback for Union Minister of State for Science and Technology, Sujana Chowdary, as Supreme Court denies some more time in re paying loan amount to Mauritius Commercial Bank Ltd.

కేంద్రమంత్రి సుజనాచౌదరికీ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!

Posted: 03/04/2016 01:05 PM IST
Sc dismisses plea sujana s firm faces liquidation

టీడీపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఆయన కంపెనీ తీసుకున్న రుణబాకాయిల ఆయనకు ప్రస్తుతం శాపంలా పరిణమించాయి. మారిషస్ బ్యాంకు రుణ బకాయిల కేసులో మరికోంత సమయాన్ని ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఐదు నెలల్లోపు సదరు మారిషస్ బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పను వెలువరించడం సుజనా చౌదరి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లైయ్యింది.

తమ నుంచి తీసుకున్న రూ.106 కోట్ల అప్పును చెల్లించే స్థితిలో సుజనా చౌదరి కంపెనీ లేనందున.. ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, దాని ఆస్తులను అమ్మి, తద్వారా తమ అప్పును తీర్చేలా ఆదేశాలివ్వాలంటూ మారిషస్‌కు చెందిన మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) దాఖలు చేసిన కంపెనీ పిటిషన్‌ను హైకోర్టు విచారణ జరిపింది. అలాగే పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయాన్ని ఎంసీబీ ఆరు నెలల వరకు పత్రికల్లో ప్రకటన ఇవ్వకుండా ఆదేశాలిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుజనా చౌదరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం సుజనా  పిటిషన్ కొట్టేయడమే కాకుండా ఆరు నెలల గడువును ఐదు నెలలకు కుదించింది.

సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమ అనుబంధ కంపెనీని హేస్టియా పేరుతో మారిషస్‌లో ఏర్పాటు చేసింది. 2010లో హేస్టియా ఎంసీబీ నుంచి రూ.100 కోట్ల మేర రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారు (గ్యారెంటార్)గా ఉంది. అయితే 2012 నుంచీ హేస్టియా బకాయి చెల్లింపులు మానేసింది. పలు పరిణామాల నేపథ్యంలో ఎంసీబీ తొలుత హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఆ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. అయితే తమ బకాయి చెల్లించే విషయంలో హేస్టియా, సుజనా యూనివర్సల్ చేస్తున్న జాప్యం, తాత్సారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీని మూసివేయాలని కోరుతూ ఎంసీబీ గతేడాది హైకోర్టులో కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  high court  sujana chowdary  maritius commercial bank  

Other Articles