China's top phone maker Xiaomi unveils new flagship handset

First look at xiaomi s mi 5 flagship

Mi 5, MWC, MWC 2016, Xiaomi, Xiaomi Mi 5, Xiaomi Mi 5 Price, Xiaomi Mi 5 Specifications, Xiaomi Mobiles, Cell Phones,Cellular Phones,Consumer Electronics,Electronics,Smartphones, Chinas top phone maker Xiaomi unveils new Mi 5,

Xiaomi on Wednesday unveiled its latest flagship smartphone, the Mi 5, at an event in Beijing, China.

బార్సిలోనాలో జియోమీ ఎంఐ-5 అవిష్కరణ.. అందుబాటులోనే ధర..

Posted: 02/24/2016 08:07 PM IST
First look at xiaomi s mi 5 flagship

తక్కువ ధరలకే హైఎండ్‌ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్లను అందించే చైనీస్‌ మొబైల్ మేకర్ జియోమీ.. ఈ కంపెనీ తాజాగా తన ప్రతిష్టాత్మక మోడలైన 'ఐఎం-5'ని  బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) లో ఆవిష్కరించింది. హై ఎండ్ అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ తెలుపు, నలుపు, బంగారం.. ఇలా మూడు రంగులలో లభిస్తుంది. దీనిలో రెండు వెరియంట్స్ ఉన్నాయి. ఒకటి హైయర్ ఎండ్ 3డీ సెరామిక్ మోడల్.. దీనిపై గీతల పడే చాన్స్‌ ఉండదు. మరొకటి తక్కువ ధరకు లభించే 3డీ గ్లాస్ మోడల్‌. దీనిపై అంతో ఇంతో గీతలు పడే అవకాశముంటుంది.

'ఎంఐ 5'లో 16 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 4కే వీడియోను అలవోకగా తెరకెక్కించగలిగే సోనీ ఐఎంఎక్స్298 స్పెన్సర్ తో రానుంది. బాగా కదులుతూ వీడియో రికార్డ్ చేసినా షేక్‌ అవ్వకుండా ఇందులో 4యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్‌ స్టేబలైజేషన్‌ టెక్నాలజీని ఉపయోగించారు. మొత్తంగా ఎంఐ-5 మూడు వెర్షన్లలో లభించనుంది. ఇందులో 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్, త్రీడీ సెరామిక్ బాడీ గల మోడల్‌ ధర రూ. 28వేలు కాగా, 64 జీబీ స్టోరేజ్‌ గల మోడల్  రూ. 24వేలకు, 32జీబీ గల మోడల్ రూ. 20వేలకు లభించనున్నాయి. తక్కువ ధర కలిగిన ఈ రెండు మోడళ్లలోనూ త్రీ జీబీ ర్యామ్‌, త్రీడీ గ్లాస్ బ్యాడీ ఉంటుంది. ఎంఐ 5 మార్చి 1న చైనాలో విడుదల కానుంది. త్వరలోనే భారత్‌లోనూ ఈ మోడల్‌ను విడుదల చేస్తామని జియోమీ కంపెనీ ప్రకటించింది.

జియోమీ ఎంఐ 5 ఫీచర్లు ఇవి:

* డ్యుయెల్ సిమ్‌
* అత్యంత శక్తిమంతమైన హెచ్‌డీ డిస్‌ప్లే, థిన్‌ సైజ్‌  
* ప్రాసెసర్‌: Snapdragon 820, Qualcomm
* బ్యాటరీ: 3,000 ఎంఏహెచ్‌
* బరువు: 129 గ్రాములు (ఐఫోన్‌ 6ఎస్‌ కన్నా 14 గ్రాములు తక్కువ)

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mi 5  MWC  MWC 2016  Xiaomi  Xiaomi Mi 5  Xiaomi Mi 5 Price  Xiaomi Mi 5 Specifications  Xiaomi Mobiles  

Other Articles