AP govt decided to give agri gold case to CBI

Ap govt decided to give agri gold case to cbi

Agri Gold, Ap, Chandrababu naidu, Agri Gold Case

Ap CM Chandrababu Naidu discussed with cabinet ministers about Agri Gold fraud. He said that they will write a letter to central govt for CBI enquiry.

ఇక అగ్రిగోల్డ్ కేసు సీబిఐకి

Posted: 02/24/2016 12:52 PM IST
Ap govt decided to give agri gold case to cbi

అగ్రీ గోల్డ్ వ్యవహారాలన్ని సీబీఐకి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రిగోల్డ్ అంశంలో సీబీఐ విచారణ కోసం కేంద్రానికి లేఖ రాయటానికి  సిద్ధమని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  విజయవాడలో  ప్రకటించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో పూర్తి పారదర్శకత ప్రదర్శించాలని.. దీనిపై ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రత్యేక విచారణకు హైకోర్టు ఆదేశించినా అభ్యంతరం లేదని చెప్పారు.  

విజయవాడలో అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. రాష్ట్రప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ఇప్పటికీ ఎర్రచందనం స్మగ్లింగ్ ఇంకా కొనసాగుతోందని.. ఇది సబబు కాదని హెచ్చరించారు. స్మగ్లిర్లపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.  అమరావతిలో జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. వారంలోగా తాత్కాలిక ఫోరెన్సిక్ ల్యాబ్ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. విజయవాడలో శాంతిభద్రతలపై నిఘా మరింత పెంచాలని.. అమరావతిలో పూర్తిగా నేరాలు నియంత్రించాలన్నారు ముఖ్యమంత్రి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Agri Gold  Ap  Chandrababu naidu  Agri Gold Case  

Other Articles