ఉంటే ఆకాశంలో లేదంటే పాతాళంలో అన్నట్లు ఉల్లి ధరలున్నాయి. రెండు నెలల క్రితం కనీసం చూద్దామంటే కూడా కనిపించని ఉల్లి ఏకంగా సెంచరీ కొట్టింది. పాపం మధ్య తరగతి వాళ్లకు ఉల్లి కొంత కాలంపాటు దూరం కూడా అయింది. నిన్నటి దాకా కన్నీళ్లు పెట్టించిన ఉల్లి.. ఇప్పుడు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమాంతంగా తగ్గిన ఉల్లి ధరలతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. రైతులు, వ్యాపారు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటివరకు కిలో రూ.20 ధర పలికిన ఉల్లి ఒక్క సారిగా రూ.3కు పడిపోయింది. ఒక క్వింటా ఉల్లి కేవలం రూ.600 మాత్రమే పలకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రెండో రకం ఉల్లి క్వింటాలుకు కనిష్టంగా రూ.300 మొదలుకొని గరిష్టంగా రూ.600లకు విక్రయాలు జరిగాయి.
చిల్లర అమ్మకాలను మానేసి హోల్ సేల్ మార్కెట్ వైపు మొగ్గుచూపుతుంటే కనీసం రవాణా ఖర్చులు కూడా చేతికి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి సాగు విస్తీర్ణాన్ని అమాంతంగా పెంచి ప్రధాన పంటగా సాగుచేయడం... దీనికి తోడు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం పెరగడం, పంటదిగుబడులు ఎక్కువగా ఉండటంతో సరఫరా పెరిగి డిమాండ్ పడిపోయి ధరలు తగ్గాయి. మరోవైపు సరైన స్టోరేజీలు(గోదాములు) లేకపోవడంతో ధరలు తగ్గటానికి ఒక కారణంగా చెబుతున్నారు. వారంరోజుల్లో ఉల్లి పూర్తి కనిష్టస్థాయికి పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more