YS jagan Emergency meeting with YSRCP MLAs

Ys jagan emergency meeting with ysrcp mlas

YS jagan, YSRCP, Jagan, AP, Bhima Nagi Reddy

YS jagan holding a emergency meeting with his Party MLAs in Lotuspand. On Bhuma NagiReddy joining into TDP news, he is conducting emergenc meeting.

ఎమ్మెల్యేలతో జగన్ అత్యవసర భేటి

Posted: 02/20/2016 11:49 AM IST
Ys jagan emergency meeting with ysrcp mlas

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. తమ పార్టీ  కీలకనేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారన్న వార్తతో ఆయనే రంగంలోకి దిగారు. ముఖ్యంగా రాయలసీమ మీద దృష్టిసారించిన చంద్రబాబు నాయుడు అక్కడి కీలకనేతలను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా సీమ నాలుగు జిల్లాల్లో వైసీపీ ప్రభావాన్ని తగ్గించాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే కర్నూల్ కీలకనేత భూమా నాగిరెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా భూమానాగిరెడ్డి, కొంత మంది ఎమ్మెల్యేలు కూడా జగన్ కు హ్యాండిచ్చి.. సైకిల్ ఎక్కనున్నారని పుకార్లు తీవ్రమయ్యాయి.

భూమానాగిరెడ్డి లాంటి కీలకనేత పార్టీలోంచి వెళ్లిపోతే పార్టీకి నష్టంతప్పదని భావించిన వైసీపీ అధినేత వైయస్ జగన్ నేరుగా రంగంలోకి దిగారు. పార్టీకి నష్టం జరుగుతోందన్న వార్తలతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో జగన్ అత్యవసర భేటి నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఈ భేటి జరుగుతోంది. పిల్ల సుభాష్ చంద్రబోస్, ధర్మాన ప్రసాదరావు, జోగు రమేశ్, ఆదిరెడ్డి అప్పారావు తదితరులతో  భేటీకానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS jagan  YSRCP  Jagan  AP  Bhima Nagi Reddy  

Other Articles