worlds danger selfie ever

Worlds danger selfie ever

Selfie, China, the Shun Hing Square tower, Shenzhen

Photographers from the “On The Roofs” collective appeared to sneak into the Shun Hing Square tower in Shenzhen and bust in a locked door to access the roof. They then clamber up a spire without safety equipment and snap a selfie with a selfie stick, 1,260 feet above the ground.

ITEMVIDEOS: ప్రపంచంలో అతి డేంజర్ సెల్పీ ఇదే

Posted: 02/17/2016 04:33 PM IST
Worlds danger selfie ever

సెల్ఫీ పిచ్చి గురించి కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ కు తెర తీసింది సెల్ఫీ. అయితే సెల్ఫీ మోజులో చాలా మంది ప్రాణం మీదకు తెచ్చుకుంటుండగా.. మరికొంతమంది ప్రాణాలను కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న సెల్ఫీ సరదా వల్ల కాలువలో పడి ముగ్గురు స్నేహితులు చనిపోయిన ఘటన అందరికి బాధ కలిచింది. అయితే తాజాగా ఓ వీడియో సెల్ఫీ మీద జనానికి ఎంత మోజు ఉందో అద్దంపడుతోంది.జ ఒకటి కాదు రెండు కాదు 1260 అడుగుల ఎత్తులో సెల్పీ దిగారు. అక్కడి నుండి చూస్తేనే కళ్లు తిరిగేలా ఉంటే.. ఏకంగా సెల్ఫీ దిగి.. ఆ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రష్యా- ఉక్రెయిన్‌కి చెందిన ఫొటోగ్రాఫర్లు 21 ఏళ్ల విటలీ రాస్‌క్లావ్‌, 25 ఏళ్ల వదిమ్‌ మకోరావ్‌లు ‘ఆన్‌ ద రూఫ్స్‌’ పేరుతో ఇలాంటి సాహసాలు చేస్తుంటారు. వీళ్లకి ఇవాన్‌ బీర్కస్‌ అనే మరో వ్యక్తి కూడా తోడయ్యాడు. చైనాలోని షెంజెన్‌ ప్రాంతంలోవున్న షున్‌ హింగ్‌ స్క్వేర్‌ టవర్‌ పైకి ఎక్కి వీరంతా సెల్ఫీ దిగారు. భూమికి దాదాపు 1260 అడుగుల ఎత్తులో సెల్ఫీ తీసుకున్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాల్లో దీనికి 28వ ప్లేస్. గతంలో ఈ బృందం ప్రపంచంలోనే రెండో ఎత్తైన షాంఘై భవనం ఎక్కారు. దీని ఎత్తు 2,073 అడుగులు. వీళ్లంతా బిల్డింగ్‌లోకి వెళ్లిన దగ్గర నుంచి అంతా వీడియో తీసి, యూట్యూబ్‌‌లో అప్‌‌లోడ్ చేశారు. 6 రోజల్లో దాదాపు 7 లక్షల హిట్స్ వచ్చాయి. ఎట్ ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Selfie  China  the Shun Hing Square tower  Shenzhen  

Other Articles