CPI Narayana said that dont arrest prostitues

Cpi narayana said that dont arrest prostitues

CPI Narayana, TRS, KCR, YS rajashekar Reddy, Telangana, Chandrababu Naidu, kapu Reservations

CPI Narayana slams political prostitutes. He said that KCR fired on YS Rajashekar Reddy when TRS leaders joined into Congress party.

అప్పటి వరకు వేశ్యలను అరెస్టు చెయ్యరాదు: సిపిఐ నారాయణ

Posted: 02/13/2016 01:09 PM IST
Cpi narayana said that dont arrest prostitues

సిపిఐ నారాయణ మరోసారి తన మాటల తూటాలను పేల్చారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నేపథ్యంలో మాట్లాడారు. గత కొంత కాలంగా టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మీద మండిపడ్డారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకర్ష్ కాంగ్రెస్ చేసినప్పుడు ఇదే కేసీఆర్ గగ్గోలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడాన్ని తీవ్రంగా నిరసించిన కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నించారు. తాజాగా పది మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరిన నేపధ్యంలో కేసీఆర్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడును కూడా నారాయణ వదలలేదు.

కాపులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యం అని.. అలా హామీ ఇచ్చిన వారి కాలర్ పట్టుకున్న వారికి తాను మద్దతిస్తానని కూడా నారాయణ వెల్లడించారు. పరోక్షంగా ఏపి సిఎం నారాచంద్రబాబు నాయుడు మీద తీవ్రంగా విమర్శించారు. రాజకీయ పార్టీలు మారుతున్న వారి మీద కేసులు పెట్టాలని నారాయణ డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టేంత వరకు వ్యభిచారం చేస్తున్న వేశ్యల మీద కేసులు పెట్టడానికి వీలులేదని అన్నారు. అలాగే అమెరికా నుండి తిరిగి వచ్చిన తెలుగు విద్యార్థులకు మరోసారి అవకాశం కల్పించాలని కూడా డిమాండ్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CPI Narayana  TRS  KCR  YS rajashekar Reddy  Telangana  Chandrababu Naidu  kapu Reservations  

Other Articles