YSRCP MLA Roja fired on TDP and Chandrababu Naidu

Ysrcp mla roja fired on tdp and chandrababu naidu

Roja, Chandrababu, YSRCP, Telangana, TDP, Ap, Jagan

YSRCP MLA Roja fired on TDP and Chandrababu Naidu YSR Congress Party dubbed the TDP as a helpless sinking ship in the both Telangana and Andhra Pradesh.

ITEMVIDEOS: ఏముందని టిడిపిలో చేరతారు..? రోజా

Posted: 02/12/2016 03:52 PM IST
Ysrcp mla roja fired on tdp and chandrababu naidu

వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారన్న వార్త మీద ఆమె ఘాటుగా స్పందించారు.  ఏం చూసి టీడీపీలోకి చేరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కౌరవులకన్నా ఒక సంఖ్య ఎక్కువే ఉన్న మీరంతా చేస్తుంది ఓ పనికి రాని పాలన అని ఆమె దుయ్యబట్టారు. ప్రజలంతా టీడీపీ ఎమ్మెల్యేలను అసహ్యించుకుంటున్నారని, అలాంటి ఎమ్మెల్యేలున్న పార్టీలోకి తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా చేరతారని ప్రశ్నించారు.

అయినా కానీ తెలుగుదేశం పార్టీ ఓ మునిగిపోయే నావ అని.. దానిలోకి ఎవరు ఎక్కుతారని రోజా మండిపడ్డారు. హైదరాబాద్ ను నెంబర్ వన్ తానే చేశానని చెప్పుకుంటే నిజంగానే ప్రజలు ఆయనకు ఒక్కటే సీటు మిగిల్చారని వ్యాఖ్యానించారు. ఏపిలో కూడా టిడిపికి రెండు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే మిగులుతాయని అన్నారు. చంద్రబాబునాయుడి పార్టీ ఓ మునిగిపోయే పడవ అని అందులోకి ఎవరు పోయినా మరింత వేగంగా అది మునిగిపోతుందని జోస్యం చెప్పారు. ఆ పార్టీలో ఉన్నవారంతా తామున్నది పల్లకిలో అని భావిస్తున్నారని, అది పాడే అనే విషయం త్వరలోనే తెలుస్తుందని రోజా చెప్పారు. ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే సస్పెన్షన్ వేశారు, లేదంటే కేసులు పెట్టారు, ప్రలోభాలు పెట్టారు.. కానీ ఒక్కరైనా నీ పార్టీలోకి వచ్చారా? అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  Chandrababu  YSRCP  Telangana  TDP  Ap  Jagan  

Other Articles