Siachen hero Hanumanthappa attains martyrdom, passes away

Siachen hero hanumanthappa attains martyrdom passes away

Lance Naik Hanumanthappa Koppad, Naik Hanumanthappa Koppad

A billion prayers were behind him but Siachen hero Lance Naik Hanumanthappa Koppad died on Thursday morning despite the best efforts by doctors at Indian Army's Research and Referral Hospital. His condition had worsened since yesterday night. The brave soldier had slipped into deeper coma and was on maximal life support.

వీర జవాన్ హన్మంతప్ప మృతి

Posted: 02/11/2016 01:20 PM IST
Siachen hero hanumanthappa attains martyrdom passes away

చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడిన వీరజవాను హన్మంతప్ప ప్రాణాలు విడిచాడు. హనుమంతప్ప మరణించినట్లు ఆర్మీ పేర్కొంది. ఆరు రోజులు మంచు చరియల కింద, ఆ తర్వాత హాస్పటల్లో మృత్యువుతో పోరాడిన జవాను హనుమంతప్ప ఇవాళ ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో కన్నుమూశాడు. గత మూడు రోజులుగా అతను వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. 33 ఏళ్ల హనుమంతప్ప ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని ఇవాళ ఉదయం ఆర్మీ మెడికల్ బులిటెన్‌లో తెలిపింది. మళ్లీ ఉదయం 11.45 నిమిషాలకు జవాను హనుమంతప్ప తుదిశ్వాస విడిచినట్లు ఆర్మీ స్పష్టం చేసింది. సియాచిన్ కొండపై మృత్యుంజయుడిగా బయటపడ్డ హనుమంతప్ప తిరిగి కోలువాలని గత రెండు రోజులు దేశవ్యాప్తంగా ప్రజలు పూజలు, ప్రార్థనలు చేశారు. ఆయన్ను కాపాడేందుకు ఆర్మీ వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. హనుమంతప్ప శరీరం చికిత్సకు సహకరించలేదు. ఈనెల 3న సియాచిన్‌లో విరిగిపడ్డ మంచు చరియల కింద హనుమంతప్ప చిక్కుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Lance Naik Hanumanthappa Koppad  Naik Hanumanthappa Koppad  

Other Articles