YSRCP | AP MLA | Chandrababu naidu | SC Cast | News

Ysrcp mlas angry on ap cm

YSRCP MLA`s Angry on AP CM, YSRCP angry on TDP, YSRCP angry on Chandrababu, Chandrababu comments on SC, YSRCP fired on TDP, YSRCP fired on chandrababu, AP YSRCP

YSRCP MLAs Angry on AP CM: YSRCP MLA kalpana and K. Srinivasulu fired on AP CM Chandrababu naidu latest comments about SC cast.

చంద్రబాబుపై వైఎస్ఆర్సీపి ఎమ్మెల్యేల ఆగ్రహం

Posted: 02/09/2016 03:37 PM IST
Ysrcp mlas angry on ap cm

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర వ్యతిరేఖతను చూపిస్తున్నారు. దళితులను అవమానించే విధంగా చంద్రబాబు మాట్లాడారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులను అవమానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆ పదవిలో కొనసాగే అర్కత లేదని, రాజీనామా చేయాలని వైఎస్పార్సీపీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

దళితులను అవమానించేలా విధంగా మాట్లాడుతున్న చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. కులాల మధ్య చిచుపెట్టేందుకు యత్నిస్తున్నారని, కాపులను, బీసీలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇదే విషయంలో చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తన ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఎస్సీగా ఎందుకు పుట్టాలనుకోలేదో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలని కల్పన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దళితులను కించపరిచే విధంగా మాటలు మాట్లాడతారా అని ఆమె ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో కుల రాజకీయాలు చేస్తున్నారని చాలాసార్లు చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. కానీ కుల రాజకీయాలు చేసింది, కులాల గురించి ప్రస్తావించింది మీరు కాదా? అంటూ ఆమె మండిపడ్డారు. అలాగే గతంలో దళితులు, బీసీల మధ్య తగాదాలు పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు.

దేశంలో కేవలం పేద, ధనిక కులాలు మాత్రమే వున్నాయని చంద్రబాబు భ్రమపడుతున్నారు. కానీ, నిజానికి రెండే కులాలున్నాయి.. ఒకటి మంచి.. రెండు చెడు అని కల్పన అన్నారు. ఎస్సీల ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాన్ని అవమానంగా భావిస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  MLA  Chandrababu naidu  SC cast  News  

Other Articles