Nara Rohit | clarifies | money issue | Saikrishna

Nara rohit clarifies money issue

Nara Rohit clarifies money issue, Nara Rohit clarifies, Nara Rohit angry on money issue, Nara Rohit latest news, Nara Rohit movies, Nara Rohit movie updates, Nara Rohit stills

Nara Rohit clarifies money issue: Telugu hero Nara Rohit clarifies about his money cheating issue. Saikrishna also clarifies on this issue.

నారా రోహిత్ పేరుతో డబ్బులు వసూలు.. క్లారిటీ!

Posted: 02/08/2016 05:52 PM IST
Nara rohit clarifies money issue

ఈ మధ్య తాటికొండ సాయికృష్ణ అనే వ్యక్తి నా పేరు చెప్పి సినిమా తీస్తానని అంటూ కొంత మంది వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. అయితే ఇక్కడొక విషయాన్ని స్పష్టం చేయాలనుకున్నాను. తాటి కొండ సాయికృష్ణ ఓ అభిమానిగా మాత్రమే నాకు పరిచయం. అంతే తప్ప అతనితో నాకు మధ్య ఎటువంటి అర్ధిక పరమైన లావాదేవీలు లేవు. నాకు మేనేజర్స్ అంటూ ఎవరూ లేరు. అలా ఎవరైనా అలా అని అన్నారంటే అది అబద్ధం. ఇలా నా అభిమానులను, స్నేహితులమని చెప్పి ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని నేను ఉపేక్షించను. ఎవరైనా అటువంటి వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడినట్టు తెలిస్తే నాకు నేరుగా తెలియజేయవచ్చు.

చివరకు ఈ విషయంపై సాయికృష్ణ స్పందించాడు. సినీ హీరో నారా రోహిత్ పేరుతో కోట్లాది రూపాయలు తాను వసూలు చేశానంటూ వస్తున్న వార్తలను టీఎన్ఎస్ఎఫ్ నేత సాయికృష్ణ ఖండించాడు. తాను కేవలం కొంతమంది వద్ద అప్పులు మాత్రమే తీసుకున్నానని, అది మాత్రం వాస్తవమని ఓ తెలుగు చానల్ తో మాట్లాడుతూ తెలిపాడు. కొంతకాలం నుంచి తనకు ఎలాంటి పనులు లేక ఖాళీగా ఉన్నానని, అంతేకానీ ఎవరి వద్ద వసూళ్లకు పాల్పడలేదని చెప్పాడు. తాను అప్పులు తీసుకున్నవారికి వడ్డీలు కూడా చెల్లిస్తున్నానని సాయికృష్ణ వివరించాడు. ఇక హీరో నారా రోహిత్ కు తాను కేవలం అభిమానినని, ఆయన సినిమాలు చూస్తానని తెలిపాడు అంతేగాక టీడీపీలో కూడా పనిచేస్తుంటానన్నాడు. తెలుగుదేశంలో తన ఎదుగుదలను చూసి ఓర్వలేని ఇతర పార్టీలవారే ఇలా తనపై ఆరోపణలు చేస్తున్నారని సాయికృష్ణ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Clarifies  Money issue  Saikrishna  

Other Articles