LEOPARD | ATTACK | VIBGYOR SCHOOL Bangalore | Injured | Video

Leopard attack in bangalore school

Leopard Attack in Bangalore school, Leopard Attack in Bangalore, Leopard in Bangalore school, Leopard Attack in school, 6 peoples injured in Bangalore school, Leopard Attack injured

Leopard Attack in Bangalore school: Leopard attacks forest officials in VIBGYOR high school Marathahalli Bangalore.

ITEMVIDEOS: రెచ్చిపోయి చిరుతతోనే పోట్లాటకు దిగేసాడు

Posted: 02/08/2016 11:04 AM IST
Leopard attack in bangalore school

జనాలు తిరిగే ప్రదేశాల్లో వుండే కుక్కలు దాడి చేస్తుంటేనే హడలెత్తిపోతుంటాం. అలాంటిది ఓ చిరుతపులిని ఓ వ్యక్తి చితకబాదేందుకు ప్రయత్నించాడు. చిరుతపై తన కోపం చూపించి, అది పారిపోయేలా చేసాడు. ఇంతకీ ఎవరతను.. ఎంటీ ఆ కథ అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే...

నిన్న బెంగళూరు మరథహల్లిలోని విబ్ గ్యార్ అనే స్కూల్ లోకి ఓ చిరుత అనుకోకుండా ప్రవేశించింది. అసలే ఆదివారం కావడం, స్కూల్లో ఎవరూ లేకపోడంతో ఎవరైనా కనిపిస్తే తన ఆకలి తీర్చుకోవచ్చని... ఆ స్కూల్ అంతటా కూడా చిరుత తెగ తిరిగేసింది. ఈ విషయాన్ని సీసీ కెమెరాలో చూస్తున్న సెక్యురిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు.

అటవీ సిబ్బంది చిరుతను పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసారు. ఈ ప్రయత్నంలో ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు. వారిలో సంజయ్ గుబ్బి అనే వ్యక్తిపై చిరుత తీవ్రంగా దాడి చేసింది. దీంతో కోపంతో రెచ్చిపోయిన సంజయ్... చిరుతపై దాడికి రెచ్చిపోయాడు. చిరుతకు వ్యతిరేఖంగా అతడు ప్రతిఘటన చేయగా.. చిరుత బెదిరిపోయి అక్కడినుంచి పారిపోయింది.

ఇక అక్కడి నుంచి తప్పించుకున్న చిరుతను ఎట్టకేలకు ఓ గదిలో బంధించగలిగారు అటవీ సిబ్బంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో చిరుత కలకలం సృష్టించిందని స్థానికులు తెలిపారు. ఈ పాఠశాలకు దగ్గర్లోనే అటవీ ప్రాంతం వుందని, అక్కడి నుంచి చిరుత వచ్చి వుండవచ్చని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Leopard Attack  Bangalore  school  Injured  News  

Other Articles