Telangana CM KCR gave finishing touch with his meeting

Telangana cm kcr gave finishing touch with his meeting

GHMC, KCR, Chandrababu Naidu, TRS, Parade Ground

Telangana CM KCR gave finishing touch with his meeting. KCR express his agenda in the Hyderabad after winning GHMC Polls

ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ నిషింగ్ టచ్

Posted: 01/31/2016 12:13 PM IST
Telangana cm kcr gave finishing touch with his meeting

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు తెలంగాణ సిఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అటెండైన గులాబీ బాస్…. బల్దియాపై సర్కార్ విజన్ ను ఆవిష్కరించారు. ప్రత్యర్థులపై సూటిగా విమర్శలు చేస్తూనే తమ అభివృద్ధి అజెండాను వివరించారు. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను గుర్తు చేసిన కేసీఆర్…. హైదరాబాద్ ను తెలంగాణకు లేకుండా కుట్రలు చేశారని గుస్సా అయ్యారు. సభలో గ్రేటర్ సమస్యలపై మెయిన్ గా ఫోకస్ చేసిన గులాబీ బాస్…. అన్నింటికి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమన్నారు. 60 ఏళ్లలో సిటీని నాశనం చేశాయని విమర్శించానే.

ఇక క్యాంపెయిన్ టీడీపీ, బీజేపీ పై తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. చేసుకుంటే చంద్రబాబుకు ఏపీలో బోలెడు పనుందంటూ కౌంటర్ ఇచ్చారు. హైటెక్ ల పేరుతో అంతా మోసం చేశారని విమర్శించారు. హైదరాబాద్ చంద్రబాబుది రక్తపు ముద్రన్నారు. చంద్రబాబు చక్కిలిగింతలు పెట్టి రాజకీయాలు చేస్తున్నారన్న గులాబీ బాస్…. ఆయన కంటే భువనేశ్వరి నయమన్నారు. అటు కేంద్రం తీరుపై గుస్సా అయిన సీఎం….డబుల్ బెడ్ రూం ఇళ్లను కేంద్రమే ఇస్తుందని దత్తాత్రేయ చెప్పడం కరెక్ట్ కాదన్నారు. గ్రేటర్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న సీఎం ఎన్నికల తర్వాత మున్సిపల్ శాఖను కేటీఆర్ కు అప్పగిస్తామని చెప్పారు. అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన గ్రేటర్ ప్రజలు ఒక్కసారి తమన గెలింపిచాలని కోరారు గులాబీ బాస్. పరేడ్ గ్రౌండ్ సభ సక్సెస్ తో పార్టీ శ్రేణులు ఖుషీగా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  KCR  Chandrababu Naidu  TRS  Parade Ground  

Other Articles