'One Lie After Another': Arvind Kejriwal Attacks Smriti Irani on Student Suicide

Beware of students kejriwal warns in hyderabad

Hyderabad Suicide,Rohith Vemula,Dalit Suicide,Hyderabad Central University,Arvind Kejriwal, Bandaru Dattatreya, Dalit scholar suicide, Chandra Babu, YS jagan, HRD Minister, Rahul Gandhi, sitaram echuri, d raja, P Appa Rao, Dalit professors, Vice Chancellor

Delhi Chief Minister Arvind Kejriwal attacked union minister Smriti Irani over her statement on the suicide of research scholar Rohith Vemula and alleged that she spoke "one lie after another."

లేఖలే కాదు.. రోహిత్ మరణం వెనుక తతంగమే వేరు..

Posted: 01/21/2016 10:03 PM IST
Beware of students kejriwal warns in hyderabad

రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను న్యూఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం పరామర్శించారు. విద్యార్థులు చేపట్టిన దీక్షకు కేజ్రీవాల్ సంఘీభావం ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ మెరిట్ ఆధారంగానే యూనివర్శిటీలో సీటు సంపాదించాడని.... అంతేకానీ... రిజర్వేషన్లతో అతడు యూనివర్శిటీలో అడుగు పెట్టలేదని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  అలాంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దేశానికే అవమానం అని అన్నారు. హెచ్సీయూలో చోటు చేసుకున్న సంఘటనలపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఎలాంటి విచారణ జరపకుండా విద్యార్థులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాశారని కేజ్రీవాల్ ఆరోపించారు.  

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ అంశాన్ని దళితులు... ఇతరులకు మధ్య ఘర్షణగా చిత్రీకరించారని విమర్శించారు. మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలతోనే హెచ్సీయూకి కొత్త వీసీ వచ్చారన్నారు. ఏబీవీపీ వేధింపులతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. యూనివర్శిటీలో ఏబీవీపీ నాయకుడు సునీల్ కుమార్పై ఏఎస్ఏ విద్యార్థులు దాడి చేయలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సునీల్ ఆపరేషన్కి...ఏఎస్ఏ దాడికి సంబంధమే లేదని అన్నారు. యూనివర్శిటీలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Delhi CM  Hyderabad Central University  Rohit  Suicide  

Other Articles