man-who-burnt-dawood-ibrahims-car-alleges-receiving-threat-calls

Hindu mahasabha leader responsible for burning dawood ibrahim s car gets death threats

dawood ibrahim, car, ablaze, death threats, Swami Chakrapani Maharaj, Dawood Ibrahim's Car, Ghaziabad

Swami Chakrapani Maharaj, who had set afire a car that purportedly belonged to Dawood Ibrahim in Ghaziabad, today claimed that he has received death threats from the underworld don.

అరవై ఏళ్లు వచ్చినా.. బుద్ది మారని దావూద్..

Posted: 01/01/2016 11:31 AM IST
Hindu mahasabha leader responsible for burning dawood ibrahim s car gets death threats

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఇటీవలే 60 ఏళ్లకు చేరుకున్నా.. అతని బుద్ది మాత్రం మారలేదు. ఒక వయస్సుకు వచ్చిన తరువాత పాపకార్యాలను వదిలి.. పుణ్యకార్యాలు చేస్తుంటారు ఎవరైనా. కానీ దావూద్ మాత్రం తాను చేసిన నేరాలకు ఎలాంటి ప్రాయశ్చిత్తం కూడా చెందడం లేదు. అతని నేర సామ్రాజ్య పునాదులను పెకిలించి.. సజీవంగా భారత్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న క్రమంలో అతని నుంచి అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ ముప్పు పొంచివుంది.

దావూద్ నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయని.. ఆయన తన అవేదనను వ్యక్తం చేశారు. తనను చంపుతామంటూ గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్ లు వచ్చాయని చెప్పారు. 'దావూద్ ఇబ్రహీం కారును తగులబెట్టిన చోటే నిన్ను తగులబెడతాం' అంటూ ఫోన్ లో బెదిరించారని వెల్లడించారు. ముంబైలో డిసెంబర్ 9న వేలంలో రూ. 32 వేలకు దావూద్ కారును చక్రపాణి దక్కించుకున్నారు. తర్వాత దాన్ని ఘజియాబాద్ లో బహిరంగంగా తగులుబెట్టారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ను కలిసినప్పుడు తనకు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తామన్నారని, తాను తిరస్కరించానని చక్రపాణి తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Swami Chakrapani Maharaj  Dawood Ibrahim's Car  Ghaziabad  

Other Articles