High court order to permit for bid Agrigold assets

High court order to permit for bid agrigold assets

Agrigold, High court, Agrigold Assets, High court on Agri Gold

High court order to permit for bid Agrigold assets. On behalf of Agrigold alligations, high court order to sale the agrigold assets and recover the money from company.

అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేయండి: హైకోర్ట్

Posted: 12/31/2015 03:40 PM IST
High court order to permit for bid agrigold assets

అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారంనాడు హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణం కేసు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఆస్తులు వేలం వేస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కోర్టుకు వివరించింది. ఎమ్ఎస్ టీసీ, శ్రీరామ్ ఆటో మాల్, ఈ-ప్రొక్యూర్ మెంట్ టెక్నాలజీకి వేలం బాధ్యతలు అప్పగించామని కమిటీ తెలిపింది. మొదటి విడతలో సంస్థకు చెందిన ఆరు ఆస్తులను వేలం వేయనున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

ఎమ్ఎస్ టీసీ, శ్రీరామ్ ఆటో మాల్, ఈ-ప్రొక్యూర్ మెంట్ టెక్నాలజీలలో ఒక్కో సంస్థకు రెండు ఆస్తులు వేలం వేసేందుకు అప్పగిస్తామన్నారు. ఇందుకు సంబంధించి మూడు వారాల్లో వెబ్ సైట్ ఏర్పాటు చేసి అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, టెండర్ల వివరాలను అందులో పొందుపరచాలని హైకోర్టు ఆదేశించింది. తొలి విడత వేలంలో రూ.3,500 కోట్లు వస్తాయని అగ్రిగోల్డ్ సంస్థ కోర్టుకు వివరించింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.6,350 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌-బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారంనాడు హైకోర్టులో విచారణకు రాగా, అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Agrigold  High court  Agrigold Assets  High court on Agri Gold  

Other Articles