ఒక్క రోజులోనే ఐదు చోట్ల చైన్ స్కాచర్లు తమ చేతివాటాన్ని చూపించారు. బంగారు గొలుసులను టార్గెట్ గా చేసుకున్న చైన్ స్నాచర్లు.. తమ పనితనాన్ని చూపిస్తున్నారు. ఇలా.. రోజుకో, రెండు రోజులకో ఒకసారి చైన్ స్నాచర్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. మూడు రోజుల్లో నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు గొలుసులు తెంచుకుపోయారు. మరి ఇంతగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న బాధితుల్లో ఆవేశాన్ని నింపుతోంది. గతంలో దిల్ సుఖ్ నగర్ లో చైన్ స్నాచర్ల మీద కాల్పులతో ఒక్కసారిగా కలకలం రేపిన పోలీసులు... ఆ తర్వాత ఎంత యాక్టివ్ గా ఉన్నారనే ప్రశ్న తలెత్తుతోంది.
Also Read: చైన్ స్నాచింగ్ కు పోలీస్ బైక్
కొన్ని రోజుల క్రితం చైన్ స్నాచర్లను పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. బైక్ రైడింగ్, ఛేజింగ్, షూటింగ్ ల్లో స్పెషలిస్టులతో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా చైన్ స్నాచర్లకు వార్నింగ్ కూడా ఇచ్చారు సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్. సైబరాబాద్, హైదరాబాద్ అని పోలీసులకు పరిధులున్నా.. చైన్ స్నాచర్లు మాత్రం ఎక్కడైనా డోంట్ కేర్ అంటున్నారు. తాజాగా జరుగుతున్న వరుస చైన్ స్నాచింగ్ లను బట్టి చూస్తే.. హైదరాబాద్ పోలీసులను నేరగాళ్లు లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more