Election Commission shocks Telangana Minister KTR

Election commission shocks telangana minister ktr

KTR, IT Minister, Elections Commission, EC, EC Notices to KTR

Election Commission shocks Telangana Minister KTR. Election commission gave notices to Telangana IT, Panchayath Minister K. Tarakarama Rao.

కేటీఆర్ కు ఎలక్షన్ కమీషన్ షాక్

Posted: 12/22/2015 09:34 AM IST
Election commission shocks telangana minister ktr

మొన్న కేసీఆర్ కు, నేడు కేటీఆర్ కు కూడా ఎలక్షన్ కమీషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ బాధ్యతను కలిగిన ఎన్నికల కమీషన్ కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాకిచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతో.. క్లాస్ తీసుకుంది. మరోసారి ఇలాంటి తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాలని సూచించింది. మరోసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘన వ్యవహారంలో రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.

సచివాలయంలో మంత్రి ఛాంబర్‌లో టీఆర్‌ఎస్ పార్టీలో ఇతర పార్టీల నేతల చేరికలు, వారికి పార్టీ కండువాలు కప్పిన ఫిర్యాదుపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. బదులుగా ఈనెల 11వ తేదీన మంత్రి కేటీఆర్ ఇచ్చిన వివరణను సైతం ఈసీ మరోసారి తప్పుబట్టింది.మీ వివరణను పరిశీలిస్తే మీ అంతట మీరే ఒప్పుకున్నారు అంటూ మరోసారి ఆ వివరణపై ఈసీ మండిపడింది. స్థానిక సంస్ధలు జరిగే ప్రాంతాల్లో అధికార హోదాలో ఉన్న మీరు వివిధ పథకాల్లో నిధులిస్తామని వారికి హామీ ఇవ్వటం మీ పార్టీ ఎన్నికల ప్రయోజనాల కోసమని భావించాల్సి వస్తుంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  IT Minister  Elections Commission  EC  EC Notices to KTR  

Other Articles