Sania Mirza ! MP awards ceremony ! money ! ticket or gift

Didn t ask for any money for attending mp awards ceremony sania mirza

Sania Mirza, Sania Mirza controversy, MP awards ceremony, sania mirza money, Pullela Gopichand, awards ceremony,, Sania Mirza jet ticker gifts, MP annual sports award ceremony, tennis news

In a statement, Sania's agency has clarified that the star did not demand for any money for attending the event.

ప్రత్యేక విమానం అడిగాం.. రూ. 5 లక్షల కథనాలు అవాస్తవం- సానియా

Posted: 12/03/2015 05:05 PM IST
Didn t ask for any money for attending mp awards ceremony sania mirza

మధ్యప్రదేశ్ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తోసిపుచ్చారు. మధ్యప్రదేశ్ వార్షిక క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంతో పాటు, మేకప్ కిట్ కోసం రూ. 75 వేలు ఇవ్వాలని తాను డిమాండ్ చేసినట్టు వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. ఈ వేడకకు వచ్చేందుకు భోపాల్ వరకు ప్రత్యేక విమానం ఏర్పాటుచేయాలని కోరిన విషయం వాస్తవమేనని సానియా మిర్జా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు.

దీంతో సానియాను పక్కనబెట్టి.. పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వేడుకను నిర్వహించింది. గత నెల 28న జరుగాల్సిన వేడుకను సానియా రాకపోవడంతో మొన్నటి శనివారం 29న నిర్వహించింది. ఈ ప్రదానోత్సవంలో మధ్యప్రదేశ్ క్రీడామంత్రి యశోధర సానియా మిర్జా పై కాసింత కటువుగా మాట్లాడారు. సానియా డిమాండ్లు సరైనవి కావని పేర్కొన్నారు. ఈ వివాదంపై సానియా మేనేజింగ్ ఏజెన్సీ క్వాన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

'మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే వేడుకలో సానియా పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చారని, అయితే అంతకు నెల రోజుల ముందే అమె 29న గోవాలోని ఓ కార్యక్రమానికి హాజరవుతానని ముందుగా వారికి మాట ఇచ్చారని క్వాన్ ఏజెన్సీ తెలిపింది. సానియా భోపాల్ వచ్చేందుకు ప్రత్యేక విమానం కావాలని కోరిన సంగతి వాస్తవమేనని, మధ్యప్రదేశ్ నుంచి గోవా వెళ్లేందుకు విమానం టిక్కెట్లు లభ్యం కాకపోవడంతో సానియా ప్రత్యేక విమానం కావాలని కోరామని చెప్పింది.  గోవా నుంచి భోపాల్ కు కమర్షియల్ విమానంలో వెళితే ఏడు గంటల సమయం పడుతుండటంతో ప్రత్యేక విమానాన్ని సమకూర్చాలని కోరామని, అంతేకాని మరో ఉద్దేశంతో కాదని క్వాన్ ఏజెన్సీ వివరించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  MP awards ceremony  money  ticket or gift  

Other Articles