అంతరిక్షంలో అద్భుతం చోటుచేసుకుంది. కేవలం రష్యాలోని సైబిరియా ప్రాంతంలో గల యూరల్ పర్వతాల సమీపంలోని వారికి మాత్రమే ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం కలిగింది. అదేంటి అనుకుంటున్నారా..? అదే సూర్యోదయం. ప్రతి రోజు మేము వేకువనే సూర్యోదయాన్ని వీక్షిస్తున్నాం అంటున్నారా..? అయితే మీకు ఎందరు సూర్యుళ్లు కనిపించారు. ఒక్కరే కదా..? కానీ సైబిరాయాలోని యూరల్ పర్వతాల సమీపంలోని ప్రజలకు ముగ్గురు సూర్యుళ్లు దర్శనమించారు. అదేంటి విచిత్రంగా వుందే..?అని కోందరు... ఇదివరకెప్పుడో విన్నట్లుగా వుందే..? అని మరికోందరు... ఓహో ఇది అదే కదా..? అని ఇంకోందరు వ్యాఖ్యానిస్తున్నారు కదూ..
ఔను నిజమే.. ఇది నిజంగా విచిత్రమైన అద్భుతమే.. గతంతో చైనా వాసులకు ఇదే విధంగా ముగ్గరు సూర్యుళ్లు కనిపించారు. అదే తరహాలో తాజాగా రష్యాలోని సైబిరియా యూరల్ పర్వతాలలో అదే ధృశ్యం అవిష్కృతమైంది. అయితే ఇంకోందరు అన్నుకున్నట్లు ఇది అదే. అంటే నిజానికి ఈ చిత్రంలో ఉన్న సూర్యుడు ఒక్కడే. వాతావరణంలోని మంచు ఫలకాల (క్రిస్టల్స్) గుండా ప్రసారమైన కాంతి మూలంగా మూడు సూర్యబింబాలు కనిపిస్తున్నాయి.
తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయినపుడు పార్హెలియన్గా వ్యవహరించే ఈ అరుదైన దృశ్యం గోచరిస్తుందట. అయితే దీనిని బట్టి ఈసారి చలి తీవ్రంగా ఉంటుందనే వాతావరణ నిపుణులు, స్థానికులు పేర్కోంటున్నారు. ఈ దృశ్యం అవిష్కరించిన సమయంలో సైబిరియాలో అనేక రోడ్డు ప్రమాదాలు సంభవించాయట. ప్రమాదానికి లోనైప్పుడు కానీ వాహనదారులు తాము రోడ్డును కాకుండా అకాశంలోని అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తున్నామన్న సంగతి తెలియలేదట. మరి జాగ్రత్త సుమండీ..!
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more