Aamir Khan: Proud to be Indian, don't need anyone's endorsement

I am proud to be indian aamir

aamir khan, intolerence comments, do not want to leave india, India, intolerance, proud to be Indian Aamir, Intolerance debate, Kiran Rao, BJP, congress, congress aamir khan, #rngawards, ramnath goenka awards, aamir khan congress, bjp, aamir on intolerance, kiran rao, aamir kiran rao, kiran rao intolerance

Actor Aamir Khan, who is in the middle of a raging controversy for his remarks against growing intolerance in the country, has said the he is proud to be Indian.

భారతీయుడిగా గర్విస్తున్నా.. అయినా నా వ్యాఖ్యలకు కట్టుబడి వున్నా..!

Posted: 11/25/2015 06:35 PM IST
I am proud to be indian aamir

దేశంలో అసహనం అంతకంతకు పెరుగుతూ పోతుందంటూ వ్యాఖ్యాలు చేసిన బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ ఎట్టకేలకు దిగివచ్చాడు. భారతీయుడిని అయినందుకు తాను గర్విస్తున్నానని అన్నాడు. తనకు గానీ, తన భార్యకు గానీ భారతదేశం వదిలిపెట్టి వెళ్లాలని లేదంటూ ఒక ప్రకటన చేశాడు. ఇప్పటివరకు తాము ఎప్పుడూ అలా పారిపోలేదని, భవిష్యత్తులో కూడా వెళ్లాలని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు.

దేశంలో అసహనం పెరిగిపోతోందని, తన కొడుకు భద్రతపై ఆందోళనగా ఉన్నందున వేరే ఏదైనా దేశానికి వెళ్లిపోవాలని తన భార్య ఆందోళన వ్యక్తం చేస్తోందంటూ వ్యాఖ్యానించి అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న ఆమిర్ ఖాన్.. ఎట్టకేలకు దానిపై స్పందించాడు. తన ఇంటర్వ్యూ పూర్తిగా చూడనివాళ్లే కావాలని తన మీద బురదజల్లేందుకు ప్రయత్నించారని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నాడు.. తన ఇంటర్య్వూ పూర్తిగా చూసిన వాళ్లు తనను అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు.

భారతదేశం తన మాతృభూమి అని, తానీ దేశాన్ని ప్రేమిస్తున్నానని చెబుతూ, ఇక్కడ పుట్టినందుకు తనను తాను అదృష్టవంతుడిగా భావిస్తున్నట్లు తెలిపాడు. తాను ఇక్కడే శాశ్వతంగా ఉండబోతున్నట్లు స్పష్టం చేశాడు. అయితే, తాను ఇంటర్వ్యూలో చెప్పిన ప్రతి అంశానికీ కట్టుబడి ఉన్నట్లు మరోసారి అన్నాడు. తన మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పినందుకు తనపై నిందలు వేస్తున్నారని, తద్వారా తాను చెప్పిన విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నందుకు చాలా విచారకరంగా ఉందని తెలిపాడు.

తనను జాతివ్యతిరేకిగా కొందరు చిత్రీకరిస్తున్నారని, అయితే భారతీయుడినైనందుకు గర్వపడుతున్నానని.. ఈ విషయంలో ఎవరూ తనను గుర్తించాల్సిన అవసరం లేదని ఆమిర్ అన్నాడు. తనకు ఈ దేశంపై ఎంత భక్తి వుందన్న విషయంలో ఎవరి ప్రోగ్రెస్ కార్డు తనకు అవసరం లేదని చెప్పారు. చివర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై' అనే పద్యంతో అమీర్ ఖాన్ తన ప్రకటనను ముగించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  intolerence comments  do not want to leave india  

Other Articles