TRS party leads in warangal bypolls

Trs party leads in warangal bypolls

Warangal, Polls, Warangal Elections, Warangal Bypolls, warangal Results, TRS, TRS Candidate Pasunuri Dayakar

TRS party leads in the Warangal bypolls. The TRS Party candidate Pasunuri Dayakar lead near one lakh votes. BJP and Congress party candidates even not far to TRS party

ఓరుగల్లులో కారు జోరు

Posted: 11/24/2015 10:36 AM IST
Trs party leads in warangal bypolls

కారు .జోరుకు మిగిలిన పార్టీల అభ్యర్థులు కుదేలవుతున్నారు. వరంగల్ ఉప ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి.. హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల కోసం లెక్కింపు మొదలు కాగానే మొదటి రౌండ్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థి లీడ్ లో కొనసాగారు. ముందుగా పోస్ట్ బ్యాలెట్ లెక్కించగా అందులో మొత్తం టిఆర్ఎస్ పార్టీనే క్లీన్ స్వీప్ చెయ్యడంతో మంచి ఓపెనింగ్ వచ్చింది. దాంతో ముందు నుండి కూడా కారు జోరు మొదలైంది. మిలిగిన పార్టీల నాయకులకు కనీస ఓట్లు కూడా కనిపించడం లేదు. మొదటి నుండి  టిఆర్ఎస్ పార్టీ లీడ్ లో ఉండగా తర్వాతి స్థానం కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థి ఉన్నాడు.

వరగంల్ లోక్ సభ నియోజక వర్గంలో మొత్తం 15, 09.671 ఓట్లు ఉండగా అందులో 10, 44, 541 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తంగా 69.19 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక అందులో టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 96, 523 ఓట్ల లీడింగ్ కొనసాగిస్తున్నరు. ఇక సర్వే సత్యనారాయణ, బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థి దేవయ్య, వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ లు వెనకుబడ్డారు. మొత్తంగా వరంగల్ ఎన్నికల్లో కారు పార్టీ క్లీన్ స్వీప్ చేస్తోంది అన్నది క్లీయర్. కాగా ఇప్పుడు ఎవరు ఎంత ఘోరంగా ఓడిపోతారు అన్నదాని మీద బెట్టింగ్ లు నడుస్తున్నాయి. బిజెపికి డిపాజిట్లు కూడా దక్కవని కొందరు, కాంగ్రెస్ పార్టీకి అన్ని ఓట్లు వస్తాయని మరికొందరు ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. కాగా వరంగల్ ఉప ఎన్నికల మీద ముందు నుండి పూర్తి దృష్టి సారించిన కేసీఆర్ ప్రభుత్వం ప్రచారంతొ హోరెత్తించింది. మంత్రులు ఎన్నికల ప్రచారాన్ని భుజస్కందాల మీద మోశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే చాలా సునాయాసంగా టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపును కైవశం చేసుకోగలరు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles