A Georgia wife named Danielle Davis given treatment to her coma husband matt devis in home | american best wives

Wife given treatment to her coma husband and get back him in her life

wife treatment coma husband, danielle devis treatment coma husband matt devis, wife helps husband, husband get back from coma, danielle devis, matt devis

wife given treatment to her coma husband and get back him in her life : A Georgia wife named Danielle Davis given treatment to her coma husband matt devis in home.

సతీసావిత్రికి ప్రతిరూపంగా నిలిచిన అమెరికా ఇల్లాలు

Posted: 11/23/2015 01:26 PM IST
Wife given treatment to her coma husband and get back him in her life

పెళ్ళయిన తర్వాత భర్తలే తమ సర్వస్వమని భార్యలు జీవిస్తుంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే.. వారి అవసరాలను తీరుస్తూ, అండగా నిలుస్తూ భర్తల్ని భరోసా కల్పిస్తుంటారు. నిర్జీవంగా బెడ్ పై పడివున్నా సరే.. వారికి సేవలు చేస్తూ తమ పతివ్రతను చాటుకుంటారు. ఈ తరహా మహిళలు భారతదేశంలోనే ఎక్కువగా కనిపిస్తుంటారని అనుకోవడం నిజంగా తప్పే. ఎందుకంటే.. అమెరికాలోనూ ఓ భార్య తన భర్తపై ఎనలేని ప్రేమ ప్రదర్శించి సతీసావిత్రికి ప్రతిరూపంగా నిలిచింది. యాక్సిడెంట్ అయి కోమాలోకెళ్ళిన తన భర్తను.. ఇంట్లోనే చికిత్స అందించి కోలుకునేలా చేసంది. గతం మర్చిపోయిన అతనిని చంటిపిల్లాడిలా చూసుకుంటూ.. తిరిగి గతం గుర్తుకొచ్చేలా చేసింది. ఇప్పుడు వారిద్దరూ హాయిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

అమెరికాలో నివాసం వుంటున్న డేనియలి అనే యువతికి సంవత్సరం క్రితం మ్యాట్ అనే యువకుడితో వివాహం అయ్యింది. అంతకుముందు ప్రేమించుకున్న వీరిద్దరూ.. వివాహానంతరం తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా కొనసాగించారు. అయితే.. పెళ్ళయిన ఆరు నెలల తర్వాత మ్యాట్ కి ఘోరమైన యాక్సిడెంట్ అయ్యింది. వెంటనే అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అందించిన డాక్టర్లు మ్యాట్ కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్పారు. ఎప్పుడు కోలుకుంటాడో తెలీయదని తేల్చేశారు. దీంతో డేనియలి తీవ్రంగా కుంగిపోయింది. అప్పుడు డాక్టర్లు ఆమె ముందు ఒకే ఒక్క ఆప్షన్ వుంచారు. కోమాలో వున్న మ్యాట్ ని మరిచిపోయి, కొత్త జీవితాన్ని ప్రారంభించు అంటూ సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించిన డేనియలి.. మరొక ఆప్షన్ ఎంచుకుంది. తన భర్త మ్యాట్‌ను ట్యూబులతో ఇంటికి తెచ్చుకుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. అనుక్షణం తోడు నిలిచింది. డాక్టర్లు సూచించిన సలహాల మేరకు చికిత్స అందిస్తూ వచ్చింది.

మూడు నెలల తరవాత ఓ రోజు మ్యాట్ కళ్లు తెరిచాడు. అప్పుడు డేనియలి ఆనందానికి అంతే లేకుండా పోయింది. అయితే అది అంతలోనే అవిరైపోయింది. ఎందుకంటే.. కోమాలోంచి కోలుకున్న మ్యాట్‌కి ఏమీ గుర్తులేవు. తండ్రి చనిపోయింది, తన పెళ్లైందీ కూడా మర్చిపోయాడు. ఓ పసిపిల్లాడు అయిపోయాడు. అతని పరిస్థితి చూసి బాధపడ్డ డేనియలి.. ఆ తర్వాత కోలుకుని అతనికి గతం గుర్తుకు తెచ్చేలా ప్రయత్నాలు చేసింది. ఫిజియో థెరపీ చేయించింది. యోగ క్లాసులకు తీసుకెళ్లింది. మరో మూడు నెలలకు మ్యాట్ మెమరీ తిరిగి వచ్చింది. ఇప్పుడు మ్యాట్, డేనియలీలు ఆనందంగా కాలం గడుపుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wife treatment coma husband  danielle devis  matt devis  

Other Articles