finally hollywood actor Charlie Sheen reveals that he is HIV positive in a show and denies pornstar allegations on him | charlie sheen controversy

Charlie sheen reveals he s hiv positive in a show and deny the rumours on him

charlie sheen, charlie sheen hiv news, charlie sheen controversy, pornstar comments charlie sheen, charlie sheen today tv show, charlie sheen hiv positive, charlie sheen romance scenes, hollywood controversies

Charlie Sheen reveals he's HIV positive in a show and deny the rumours on him : finally hollywood actor Charlie Sheen reveals that he is HIV positive in a show and denies pornstar allegations on him.

‘ఆ విషయం’ దాచేందుకు 66 కోట్లా!

Posted: 11/18/2015 01:25 PM IST
Charlie sheen reveals he s hiv positive in a show and deny the rumours on him

తనకున్న ప్రాణాంతక ‘హైచ్ఐవీ’ వ్యాధిని దాచేందుకు హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ చాలాకాలం నుంచి ప్రయత్నిస్తూ వచ్చాడు. కానీ.. ఇటీవల ఓ పోర్న్ స్టార్ 'ఓ హాలీవుడ్ స్టార్కు హెచ్ఐవీ సోకింది' అని సంచలన వ్యాఖ్యలు చేయడంతో అది తానేనంటూ చార్లీ బహిరంగంగా అంగీకరించాడు. అయితే.. అంతకుముందు ఈ రహస్యాన్ని దాచేందుకు ఈ నటుడు చాలా తంటాలు పడాల్సి వచ్చిందట. ఇతనికి ఆ వ్యాధి వుందని తెలుసుకున్న కొందరు వ్యక్తులు.. ఆ విషయాన్ని తాము ప్రపంచానికి చెప్పకుండా వుండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారట. దాంతో భయాందోళనలకు గురైన ఆ నటుడు.. తన రహస్యం ప్రపంచానికి తెలిస్తే తన ఇమేజ్ దెబ్బతింటుందని భావించి.. తనని బ్లాక్ మెయిల్ చేసినవారి నోరు మూయించడానికి సుమారు రూ.66 కోట్లు వారికి ధారబోసినట్లు వెల్లడించాడు.

'టూ అండ్ ఎ ఆఫ్ మెన్ షో'తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హాలీవుడ్ నటుడు.. తనపై తనపై వస్తున్న ఆరోపణలపై ఓ టీవీ షోలో వివరణ ఇచ్చాడు. తనకు తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందన్న విషయాన్ని అంగీకరించిన చార్లీ.. ఉద్దేశపూర్వకంగానే ఇతరులకు హెచ్ఐవీని అంటించాడని, తనకున్న ఆ వ్యాధి వివరాలను దాచి లైంగిక సంబంధాలను కొనసాగించినట్లుగా తనపై వస్తున్న ఆరోపణలలో ఏమాత్రం వాస్తవం లేదంటూ ఖండించాడు. తనకు నాలుగేళ్ల క్రితం ఎయిడ్స్ ఉన్నట్లు నిర్థారణ అయిందని.. ఆ తరువాత తగిన జాగ్రత్తలు తీసుకొని నిజాయితీగానే లైంగిక సంబంధాలు జరిపినట్లు తెలిపాడు. అయితే చార్లీతో నాలుగేళ్ల క్రితం ఏడాదిపాటు గడిపిన మాజీ పోర్న్ స్టార్ బ్రీ ఓల్సన్ మాత్రం అతని వ్యాఖ్యలను ఖండించింది. చార్లీ తనతో గడిపిన ఏడాదిలో మాట మాత్రమైనా తనకు ఈ విషయం గురించి చెప్పలేదని ఆమె వెల్లడించింది. ఎప్పుడూ 'ఐయామ్ క్లీన్' అని చెప్పేవాడని తెలిపింది. అయితే తనకు హెచ్ఐవీ ఫలితాలు నెగటీవ్ అని తేలాయని చెప్పిన ఓల్సన్ ఉద్దేశపూర్వకంగానే చార్లీ రహస్యాన్ని దాచాడని ఆరోపించింది.

ఒకప్పుడు అమెరికాలోనే టీవీ షో కార్యక్రమాలతో ఫేమస్ అయిన చార్లీ షీన్.. ఆనాడు అత్యంత రెమ్యునరేషన్ అందుకుని తన ఖాతాలో భారీగానే డబ్బులు జమ చేసుకున్నాడు. పేరుప్రఖ్యాతలు బాగానే సంపాగించుకున్నాడు కాబట్టి.. ఇతనిపై పలువురు సెలబ్రిటీలతో పాటు పోర్న్స్టార్లతో సైతం ఫిదా అయిపోయారు. వారితో విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు కొనసాగించాడు. అయితే.. తనకున్న హైచ్ఐవీ విషయాన్ని దాచి, ఉద్దేశపూర్వకంగానే అందరికీ హెచ్ఐవీని అంటించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ నటుడు మీడియా ముందుకొచ్చి.. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : charlie sheen hiv news  hollywood contoversies  hollywood porn stars  

Other Articles