a man named sabir ali killed his friend mahammad gulam for not giving back his wife salma who mortgages her for debt | man killed his friend | mortgages wife

Man killed his friend for not giving back his wife who mortgages her for money

mortgages wife, man killed friend, sabir ali killed gulam, bihar crime news, friend mortgages his wife, man mortgages his wife for debt, man killed his friend for mortgages wife, man killed another man

man killed his friend for not giving back his wife who mortgages her for money : a man named sabir ali killed his friend mahammad gulam for not giving back his wife salma who mortgages her for debt.

తాకట్టు పెట్టిన భార్యను స్నేహితుడు విడిచిపెట్టలేదని..

Posted: 11/17/2015 11:39 AM IST
Man killed his friend for not giving back his wife who mortgages her for money

అత్యవసరమైన పరిస్థితుల్లో ఏం చేయాలో తోచని ఓ వ్యక్తి.. తన స్నేహితుడు వద్ద నుంచి రూ.30 వేలు అప్పు తీసుకున్నాడు. అందుకు బదులుగా తన భార్యను తాకట్టు పెట్టాడు. తన సమస్యలన్నీ తీర్చుకున్న అనంతరం అతనికి డబ్బులు తిరిగిచ్చేందుకు బిజీ అయిపోయాడు. అటువైపు వారిద్దరూ సహజీవనం చేస్తూ తమ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. చివరికి అప్పు తీసుకున్న వ్యక్తి ఎలాగోలా తన స్నేహితుడికి తీర్చేశాడు. కానీ.. తన భార్యను వదిలిపెట్టాలంటే వడ్డీ రూపంలో మరింత సొమ్ము కావాలని స్నేహితుడు డిమాండ్ చేయడంతో అతడిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన చంఢీగడ్ లో వెలుగు చూసింది.

బీహార్‌లోని అరియా జిల్లాకు చెందిన మహ్మద్ గులామ్ అనే వ్యక్తి గత రెండున్నరేళ్లుగా యమునానగర్‌లో ఉంటున్నాడు. పత్తి ప్రాసెసింగ్ వ్యాపారం చేసే గులాంకు సబీర్ అలీ అనే స్నేహితుడు వున్నాడు. అతడు కూడా బిహార్‌ నుంచి వలస వచ్చినవాడే. ఓ టిఫిన్ సెంటర్ నడుపుతూ, కాంట్రాక్టర్లకు కూలీలను సరఫరా చేసే సబీర్ కు సల్మా అనే భార్య వుంది. ఓ సందర్భంలో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో సబీర్ కూరుకుపోవడంతో... జనవరిలో తన స్నేహితుడైన గులాం వద్ద నుంచి రూ. 30వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే.. ఇందుకు బదులుగా ఏదో ఒకటి తాకట్టు పెట్టాలని గులాం కండీషన్ పెట్టడంతో.. దిక్కుతోచని స్థితిలో సబీర్ తన భార్యని తాకట్టు పెట్టాడు. దాంతో గులాం ఆమెను యమునానగర్ సమీపంలోని జగధారి నగరంలో గల తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటినుంచి వారిద్దరూ సహజీవనం చేస్తూ తమ లైఫ్ ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. మార్చిలో సల్మా, గులాం ఇద్దరూ కలిసి బిహార్, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు తిరిగారు.

అయితే.. సెప్టెంబర్‌లో మళ్లీ పత్తి సీజన్ మొదలు కావడంతో ఇద్దరూ యమునానగర్ తిరిగొచ్చారు. వాళ్లిద్దరూ అక్టోబర్ నెలాఖరు వరకు కూడా సహజీవనంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఉన్నట్టుండి గులాం దారుణ హత్యకు గురై కనిపించాడు. గులామ్ శం రెండు వారాల క్రితం పోలీసులకు దొరికింది. ఆ కేసును ఛేదించే క్రమంలో హంతకుడు అతడి స్నేహితుడు సబీర్ అని తేలింది. తాను రూ.30 వేలు చెల్లించినా, తన సల్మాను విడిచిపెట్టాలంటే మరో రూ. 20 వేలు వడ్డీగా ఇవ్వాల్సిందేనని గులాం చెప్పాడని, సరేనని ఆ మొత్తం కూడా ఇచ్చినా తన భార్యను వదల్లేదని.. దాంతో తాను, తన భార్య కలిసి గులాంను చంపేశామని సబిర్ పోలీసులకు తెలిపాడు. ఈ హత్యలో వాళ్లకు మరికొందరు స్నేహితులు కూడా సహకరించారని తెలుసుకున్న పోలీసులు.. అందరినీ అరెస్టు చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mortgages wife crime  sabir ali killed gulam  man killed his friend  

Other Articles