Sixty thousand Maggi noodles kits sold out in just 5 mins on Snapdeal

Sixty thousand maggi noodles kits sold out in just 5 mins on snapdeal

Maggi, Noodles, welcome kit, Maggi in India, Nestle, Maggi in Market

It took just 5 minutes for 60,000 welcome kits of Nestle India’s Maggi noodles to be sold out on Snapdeal as consumers thronged the ecommerce platform to lap up their 2-minute instant noodles.Earlier this week, Snapdeal had announced that it will sell Nestle’s Maggi via a unique “flash sale model” as the noodles brand made a comeback after a gap of five months.

మ్యాగీ ఓపెనింగ్ అదుర్స్

Posted: 11/13/2015 08:41 AM IST
Sixty thousand maggi noodles kits sold out in just 5 mins on snapdeal

రెండు నిమిషాల్లో మ్యాగీ రెడీ అంటూ గడప గడపకు చేరువైన మ్యాగీ చాలా రోజులు మార్కెట్ లో కనిపించలేదు. కానీ తాజాగా ప్రమాణాలను పాటిస్తే తిరిగి మార్కెట్ లోకి వచ్చేసింది. నెస్లే కంపెనీకి భారీ నష్టాలను కలిగించి.. మ్యాగీ నూడిల్స్ తిరిగి మార్కెట్లో పాగాకు సిద్దమైంది. మ్యాగీ నూడుల్స్‌కు ప్రజల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఐదు నెలల నిషేధం తర్వాత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన మ్యాగీ నూడుల్స్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా దుకాణాల ద్వారా విక్రయాలకే పరిమితమైన మ్యాగీ నూడుల్స్‌ను ఆన్‌లైన్ దిగ్గజం స్నాప్‌డీల్‌లో అమ్మకానికి పెట్టిన ఐదు నిమిషాల్లో రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.

ఐదు నిమిషాల్లో 60 వేల మ్యాగీ వెల్‌కమ్ బ్యాక్ కిట్స్ అమ్ముడైనట్లు స్నాప్‌డీల్ వెల్లడించింది. ఈ వెల్‌కమ్ బ్యాగ్ కిట్‌లో 12 మ్యాగీ ప్యాకెట్లు, 2016 సంవత్సరానికిగాను క్యాలెండర్, మ్యాగీ ఫ్రీజ్‌పై వాడే అయస్కాంతం, కంపెనీకి చెందిన పోస్ట్‌కార్డు, ఒక వెల్‌కమ్ బ్యాక్ లెటర్ ఉన్నాయని స్నాప్‌డీల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోనీ నవీన్ తెలిపారు. మ్యాగీ నూడుల్స్‌లో సీసం పదార్థాలు మోతాదుకు మించి ఉందన్న ఆరోపణలు రావడంతో భారత ఆహార ప్రమాణాల సంస్థ..జూన్‌లో వీటిపై నిషేధం విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maggi  Noodles  welcome kit  Maggi in India  Nestle  Maggi in Market  

Other Articles