youth sets new trend for engagement with tatoo rings

Tattoo rings replaces diamond rings for engagement

tatoo rings, tatoo engagement rings, youth sets new trend, tattoo rings replaces diamond rings, tattoo rings for engagement, youth new trend for engagement, permanent tatoo rings, Marriage Problems, Marriage, Marriage Advice, Marriage Advice From the Divorced, Toasts and Speeches, Happy Marriage, youth, new trend, diamond rings

youth sets new trend for their engagement, replacing diamond rings with that of permanent tatoo rings

‘యంగే’జ్ మెంట్ స్పెషల్.. డైమండ్ రింగ్స్ స్థానంలో టాటూ రింగ్స్

Posted: 11/12/2015 08:28 PM IST
Tattoo rings replaces diamond rings for engagement

ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది అనగానే సగం పెళ్లి అయ్యింది అంటుంటారు పెద్దలు. అప్పటి వరకు ఒకరికొకరు తెలిసినా.. తెలియక పోయినా.. ఆ క్షణం నుంచి వారి మధ్య పెనవేసుకునే పరిచయాలు, వారి స్నేహితులతో పరిచయాలు, అక్కడి నుంచి షాపింగ్ లు, అలా అలా చెప్పుకుంటూ పోతే.. చాలానే తతంగం వుంటుంది. సగం బార్యభర్తలు అయినట్లుగా పరిగణించబడి ఫియాన్సీ, వుడ్ బీ అంటూ ఎక్కడికెళ్లినా పరిచయాలు చేసుకుంటారు.

అయితే ఈ ఎంగేజ్‌మెంట్‌ అనగానే రింగులు మార్చుకోవడం లేదంటే ఘనంగా పూజాదికాలతో దండలు మార్చుకోవడం చూస్తుంటాం. ఒకనాటి రోజుల్లో పూలు పండ్లు అని కూడా పిలిచేవారు. రానురాను దానిని నిశ్చితార్థంగా పేర్కోంటూ వచ్చారు పెద్దలు. అయితే ఈ నిశ్చితార్థంలో కాబోయే వధూవరులిద్దరూ రింగ్‌ తొడగ్గానే పెళ్ళి అయినట్లుగానే భావిస్తారు. అయితే ఉంగరాలు, దండలు మార్చుకుని, పెద్దలు స్నేహితుల సమక్షంలో ఈ తంతు జరుపుకుంటే ధ్రిల్ ఏముందనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ.. ఈ మధ్య కుర్రకారు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

సరికొత్తగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్న యంగ్ జే జంటలు.. నయా ధ్రిల్ ను పొందుతున్నారు. ఉంగరాలు మార్చుకోవడానికి బదులుగా పెళ్ళి చేసుకోవాలనుకున్నవాళ్ళు ఇద్దరూ తమ వేళ్ళపై లేదంటే చేతులపై మ్యాచింగ్‌ టాటూలు వేయించుకుంటున్నారు. ఉంగరం అయితే ఎప్పుడైనా తీసేయవచ్చు కానీ టాటూలు శాశ్వతంగా ఉంటాయి కదా అంటున్నారు. తమ ప్రేమకు గుర్తుగా అవి నిలిచిపోతాయని చాలామంది ఎంగేజ్‌మెంట్‌ టాటూ, వెడ్డింగ్‌ టాటూలపై ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా, యూరప్‌ల్లో ఇదే ఇప్పుడు పెళ్ళికి, ఎంగేజ్‌మెంట్‌కు సరికొత్త ట్రెండ్‌గా మారింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tatoo engagement rings  youth  new trend  diamond rings  

Other Articles