rapist ravi playing marriage game in police interrogation who raped nursing student in mini bus | bus rape incidents | rape controversies

Rapist ravi playing marriage game in police interrogation who raped nursing student

nursing student rape case, bus driver raped nursing student, bus driver ravi raped girl, mini bus rape incident, rape controversies, bus rape incidents, nursing student rape incident twist

rapist ravi playing marriage game in police interrogation who raped nursing student : rapist ravi playing marriage game in police interrogation who raped nursing student in mini bus.

‘పెళ్లి’ నాటకాలాడుతున్న రేపిస్ట్

Posted: 11/09/2015 11:38 AM IST
Rapist ravi playing marriage game in police interrogation who raped nursing student

కామంతో మదమెక్కిన ఓ యువకుడు కదులుతున్న బస్సులో ఓ యువతిపై దారుణంగా అత్యాచారం చేశాడు.. తనకేమీ తెలియదన్నట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. పోలీసులకు చిక్కిన అనంతరం ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ కొత్త స్టోరీని వెలుగులోకి తీసుకొచ్చాడు.. సంవత్సరం నుంచి ఆమెను కోరుకుంటున్నానని అబద్ధం చెప్పాడు.. పెళ్లి కూడా చేసుకుంటానంటూ వాపోతున్నాడు.. కానీ బాధితురాలు మాత్రం అతనెవరో కూడా తెలియదని తేల్చి చెప్పింది.. తనపై అఘాయిత్యం జరగడానికి రెండురోజుల ముందే రవిని చూశానని.. ఆ తర్వాత తనపై దారుణానికి ఒడిగట్టాడని పేర్కొంది. దీంతో.. ఆ కీచకుడు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని పోలీసులు భావిస్తున్నారు.

గురువారం కదులుతున్న మినీ బస్సులో 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై రవి (21) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను బస్సునుంచి దించేసి అక్కడి నుంచి తుర్రుమన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. నిందితుడిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో రవితోపాటు క్లీనర్ మంజునాథ్ ను కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న అనంతరం విచారించగా.. నిందితుడు రవి ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ‘పెళ్లి’ నాటకాన్ని తెరమీదకి తీసుకొచ్చాడు. గత సంవత్సరకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానని వెల్లడించిన రవి.. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానంటూ పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. ఆ నర్సింగ్ విద్యార్థినిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు ఇంటరాగేషన్ లో రవి పలుమార్లు చెప్పినట్లు పోలీసులు తెలుపుతున్నారు.

‘నిందితుడు రవి ఏడాది కాలంగా ఆ నర్సింగ్ విద్యార్థినిని ప్రేమిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని అతడు కోరగా ఆమె తిరస్కరించింది. దీంతో ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలను పెళ్లి చేసుకుంటానని ఇంటరాగేషన్ లో పదేపదే కోరాడు’ అనిని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రవి చెప్పిన ప్రేమకథ నిజమో కాదో తెలుసుకునేందుకు బాధితురాలిని పోలీసులు విచారించగా.. అసలు రవితో తనకు పరిచయం లేదని ఆమె చెప్పింది. తనపై అఘాయిత్యం జరగడానికి రెండు రోజుల ముందే రవిని చూశానని తెలిపింది. దీంతో పోలీసులు కాస్త ఆందోళనలో మునిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటోంది. బస్సు డ్రైవర్ రవి, క్లీనర్ మంజునాథ్‌ లను పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nursing student rape case  bus driver raped student  bus rape incidents  

Other Articles