Why sana flee after Rajaih daughter in law death

Why sana flee after rajaih daughter in law death

Rajaiah, Rajaiah Daughter-in-law, rajaiah's Case, Sarika Death, Sana, Congress Rajaiah

Police arrest A4 Guilty Sana in Rajaiah's Daughter-in-law death. Warangal police arrested Sana in Khammam dist premises

సన ఎందుకు పారిపోయింది.?

Posted: 11/09/2015 08:21 AM IST
Why sana flee after rajaih daughter in law death

వరంగల్‌లో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ రాజయ్య కోడలు, మనవళ్ళ మృతి కేసులో A4 ముద్దాయి అయిన సనాను ఆదివారం ఖమ్మంలో పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్‌ అనంతరం ఆమెను వరంగల్‌ సీసీఎస్‌ పోలీసులు తీసుకెళ్లినట్లు సమాచారం. జిల్లా సరిహద్దు ప్రాంత మైన ఖమ్మం రూరల్‌ మండలంలో ఆమె తలదా చుకున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వరంగల్‌ పోలీసులు స్థానిక పోలీసుల సహకా రంతో అదుపులోకి తీసుకుని కూసుమంచి మీదుగా వరంగల్‌కు తదలించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని మాత్రం జిల్లాలో పోలీసులు ఎవరూ ధ్రువీకరించలేదు.

సనాను జిల్లాలోనే ఉంచి విచారణ జరుపుతున్నట్లు ఒక వాదన ప్రచారంలో ఉంది. మొత్తం మీద కీలక వ్యక్తిగా పేరున్న సనా స్థానికంగానే నాలుగు రోజులు బస చేసిందనే విషయం ఇక్కడి వారిని విస్మయానికి గురి చేసింది. ఆమెకు ఎవరు ఆశ్రయ మిచ్చారు? ఖమ్మంతో ఆమెకు ఉన్న సంబంధాలు ఏమినటన్నది తెలియాల్సి ఉంది. కాగా రాజయ్య కోడలిది ఆత్మహత్యేనని ప్రాథమికంగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఆమె కావాలనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బెడ్ రూంలో కావాలనే రెండు సిలిండర్లు పెట్టుకొని.. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా పోలీసులు మొత్తం కేసును లోతుగా పరిశోధిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajaiah  Rajaiah Daughter-in-law  rajaiah's Case  Sarika Death  Sana  Congress Rajaiah  

Other Articles