Man Says he is Chiranjeevis Eldest Son

Man says he is chiranjeevis eldest son

Chiranjeevis Eldest Son, Chiranjeevis Son, Chiranjeevis Eldest Son in HRC, Chiranjeevis Eldest Son for DNA Test, Chiranjeevi updates, Chiranjeevi News, Chiranjeevi son, Chiranjeevi in Pasivadi Pranam

Tollywood film industry shocked with a sudden twist and a man approached State Human Rights Commission today in Hyderabad and says he is the eldest son of Mega Star Chiranjeevi and ready for the DNA test. A person named Sujith alias Ravinder said that he is the elder son of actor Chiranjeevi, and he also urges to conduct DNA test to cross check. Another interesting news is that he acted in Chiranjeevi’s one of the super hit film Pasivadi Pranam.

ITEMVIDEOS: చిరంజీవి తన తండ్రి అంటున్న వ్యక్తి

Posted: 11/07/2015 07:56 AM IST
Man says he is chiranjeevis eldest son

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ గురించి అందరికి తెలుసు. తనకు తానుగా సినిమా రంగంలో నిలదొక్కుకొని.. మెగస్టార్ గా ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తన తండ్రి అంటూ ఓ వ్యక్తి హెఆర్సీని ఆశ్రయించారు. అవును.. చిరంజీవి నా తండ్రే కావాలంటే డిఎన్ఎ టెస్ట్ కూడా చెయ్యండి నిజం ఏంటో మీకే తెలుస్తుంది అంటూ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. చిరంజీవి, చిరంజీవి భార్య సురేఖ తనను ఎత్తుకున్న ఫోటోలను కూడా చూపిస్తున్నాడు. పసివాడి ప్రాణం సినిమాలో నటించింది తానేనని కానీ.. వేరే ఎవరి పేరునో వేశారని అంటున్నారు. అయితే కేవలం పాపులారిటీ కోసమే ఇలా చేస్తున్నారని చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను పాపులారీటీ కోసం ఇలా చెయ్యడం లేదని అంటున్నారు ఆ వ్యక్తి. అసలు ఏం జరిగిందో చూడండి.

చిరంజీవి తన తండ్రి అని... అంటున్న వ్యక్తి పేరు రవీందర్. పసివాడి ప్రాణం సినిమాలో సుజిత గా.. మాటలు రాని మూగ వాడిగా ఉన్నది కూడా తానేనని అంటున్నారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన రాజ్యలక్ష్మి తనను పెంచిందని... 15 ఏళ్లుగా నటుడిగా అవకాశాలకోసం ప్రయత్నిస్తున్నట్లు అతను వివరించారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ నేర్చుకునేందుకు కొద్ది రోజుల క్రితం 30 సినిమా సీడీలు చూడగా... అందులో పసివాడి ప్రాణం సినిమాలో ఉన్నది తానే అని గుర్తించి తన పెంపుడు తల్లి రాజ్యలక్ష్మిని ప్రశ్నించగా... ఆమె అవునని చెప్పినట్లు వివరించాడు. తర్వాత హైదరాబాద్ కు వచ్చి ఫిలించాంబర్‌ లో ఆరా తీయగా.. అక్కడా అవుననే సమాధానమే వచ్చిందట. అలా చిరంజీవి తన తండ్రి అంటున్నాడు రవీందర్. మరి చూడాలి నిజం ఏంటీ అన్నది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles