several mysteries in siricilla rajaiah tragedy

Siricilla rajaiah s daughter in law sarika mystery death

Siricilla Rajaiah, Siricilla Rajaiah family members, Siricilla Rajaiah fire accident, Siricilla Rajaiah unable to contest elections, Siricilla Rajaiah requests party to change his candidature, rajaiah warangal by polls, rajaiah family fire accident, siricilla rajaiah daughter in law fire accident, fire accident, four burnt alive, warangal, Siricilla Rajaiah, Warangal bypolls

Siricilla Rajaiah’s daughter in law and her children lost their breath in a fire accident but sarika's parents alleges its murder.

అగ్ని ప్రమాదం వెనుక అనుమానాలెన్నో..?

Posted: 11/04/2015 01:57 PM IST
Siricilla rajaiah s daughter in law sarika mystery death

సిరిసిల్ల రాజయ్య ఇంట్లో సంభవించిన అగ్నిప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తుంది. రాజయ్య కోడలు తరపు బంధువులు మాత్రం సారికది హత్యేనంటున్నారు. రాజయ్య కుటుంబ సభ్యులే తమ బిడ్డను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. సారిక ఆత్మహత్య చేసునేంత పిరికిది కాదని అన్నారు. రాజయ్య, ఆయన భార్య, కోడుకు అనీల్ పై గతంలో గృహహింస కేసు నమోదు చేసిన నేపథ్యంలో అమెతో సెటిల్ మెంట్ చేసుకుని వరంగల్ లోని ఇంటిని అమెకే అప్పగించి వెళ్లిన రాజయ్య రెండు రోజుల క్రితమే వరంగల్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో తనకు వరంగల్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు టికెట్ ఇవ్వొద్దని ఏఐసీసీకి మూడు రోజుల క్రితం సారిక లేఖ రాయడంపై మరోమారు వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సారిక, అమె పిల్లలు అగ్నికి సజీవ దహణం కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. కాగా, సారికది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* గ్యాస్ లీక్ కావడంతోనే సారిక అమె పిల్లలు మరణించారా..?
* గ్యాస్ లీక్ అయ్యి కేవలం వారు నిద్రిస్తున్న బెడ్ రూం లోకే ఎలా వెళ్లింది..?
* ఇంట్లోని ఏ ఇతర వస్తువులు అగ్నికి ఎందుకు ఆహుతి కాలేదు.?
* సారిక బెడ్ రూం నుంచి మంటలు వ్యాపించక పోవడానికి కారణాలేమిటి..?
* గ్యాస్ సిలిండర్ లీక్ కావడానికి కారణాలు ఏమిటీ..?
* సారిక ఆత్మహత్య బెదిరింపులను రాజయ్య లైట్ గా తీసుకున్నారా..?
* వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో పాల్గొనవద్దనే ఆత్మహత్యా..?
* వంటగదిలో వుండాల్సిన సిలిండర్ బెడ్ రూమ్ వద్దకు ఎలా వెళ్లింది..?

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sirisilla rajaiah  fire accident  warangal by polls  congress  

Other Articles