Supreme court order to telecast ABN Andhrajyothy channel

Supreme court order to telecast abn andhrajyothy channel

Supreme court, ABN Andharajyothy, Telangana, MSOs, KCR, Telangana

Supreme court orders to telecast ABN Andhrajyothy in telangana. ABN Andhrajyothy channel banned in telangana since more than five hundred days.

ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు.. సుప్రీంకోర్ట్ తీర్పు

Posted: 11/03/2015 03:59 PM IST
Supreme court order to telecast abn andhrajyothy channel

తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసింనందుకు తెలంగాణ వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేసేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంది. ముఖ్యంగా తెలంగాణ సిఎం కేసీఆర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీద కక్షసాధింపు చర్యలకు దిగారు అన్నది అందరికి తెలిసిన నిజం. అయితే దాదాపు ఐదు వందల రోజులకు మించి ఆ చానల్ ప్రసారాలు నిలిచిపోయాయి. అయితే తాజాగా సుప్రీం కోర్ట్ లో ఏబీఎన్ కు మద్దతు లభించింది. తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు పున:ప్రారంభించాలని సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా మీడియా మీద చేస్తున్న జులుంను సుప్రీంకోర్ట్ వ్యతిరేకించింది. తెలంగాణ సిఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీద నిషేదం అమలైంది. ఎంఎస్ఓల పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఆ ఛానల ప్రసారాలను నిలిపివేసింది. అయితే గత 500 రోజుల నుండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేస్తున్న న్యాయపోరాటానికి న్యాయం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆ ఛానల్ ప్రసారాలను పునరుద్దరించాలని సుప్రీంకోర్ట్ తీర్పునిచ్చింది. తాజా తీర్పుతో ఎబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ అభిమానులు, ఉద్యోగులు, మీడియా సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మద్దతును ప్రకటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Supreme court  ABN Andharajyothy  Telangana  MSOs  KCR  Telangana  

Other Articles