CM travelled in a auto

Cm travelled in a auto

Rajasthan, Art on Wheel, Vasundhara Raje, Autos, Jaipur, CM in Auto

Rajasthan cm Vasundhara Raje travelled in a auto called art on wheels. In Jaipur town, Rajasthan govt introduced new art on wheels to develope tourism in the state

ఆటో ప్రయాణం చేసిన సిఎం

Posted: 11/03/2015 03:13 PM IST
Cm travelled in a auto

ఓ రాష్ట్రానికి సిఎం అంటే ఎలా ఉండాలి.. ఆ హుందాతనం.. హంగు ఆర్భాటాలు ఎలా ఉంటాయి. మామూలు వ్యక్తులు ఎవరైనా ఊహించలేనంతలా ఉంటుంది. కానీ ఓ సిఎం మాత్రం నింగి వదిలి నేల దిగినట్లు కనిపించింది. సిఎం గా తన హోదా దిగి.. ఓ ఆటోలో ప్రయాణించారు. అంతేనా.. ఆటో ప్రయాణం భలే ఉంది మీరు కూడా ఇలాంటి ఆటోల్లో ప్రయాణించిన ఫోటోలు మాకు పోస్ట్ చెయ్యండి అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇంతకీ ఇంత ప్రచారం ఎందుకు చేస్తున్నారు..? ఆ ఆటోల స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే.. ఆటోలో ప్రయాణం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. జైపూర్ నగరంలో టూరిజాన్ని మరింత పెంచేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కొత్తగా ఆర్ట్ ఆన్ వీల్స్ ఆటోలను ప్రవేశపెట్టింది. ఆటోలను మరింత అందంగా, కళాత్మకంగా తీర్చిదిద్ది వాటిని జైపూర్ సిటీ వీధుల్లో నడిపించేందుకు ప్రభుత్వం సిద్దపడింది. వీటిని ప్రారంభిస్తూ.. వసుంధర రాజే ఫోటోలకు ఫోజులిచ్చారు. అలాగే తన ట్విట్టర్ లో ఫోటోలు పెట్టి.. ప్రజలు కూడా వీటిలో ప్రయాణించాలని.. ఆ ఫోటోలను తనతో షేర్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  Art on Wheel  Vasundhara Raje  Autos  Jaipur  CM in Auto  

Other Articles