Indian selectors lash out at Virender Sehwag over farewell Test comments

Selector fires back at sehwag in farewell test controversy

Virender Sehwag, Virender Sehwag,Cricket Doesn't Work Like That, Viru: Selectors on Sehwag's Farewell Thoughts, Indian national selectors, Sehwag farewell Test match, latest Cricket news

Indian national selectors have retorted to Virender Sehwag’s comments on a television show that he would have liked a farewell Test match.

వీరూ వ్యాఖ్యలపై సెలక్టర్ల ఆశ్చర్యం.. అభిమానుల విసుర్లు

Posted: 11/02/2015 09:03 PM IST
Selector fires back at sehwag in farewell test controversy

దేశం తరఫున 12 సంవత్సరాలు ఆడిన క్రికెటర్‌కు కనీసం వీడ్కోలు మ్యాచ్ ఆడే అర్హత ఉండదా అని ప్రశ్నించిన భారత మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలపై సెలెక్షన్ కమిటీ స్పందించింది. తాము ఏ ఆటగాడ్ని  వీడ్కోలు పలకాల్సిందిగా ఒత్తిడి చేయమని, అలాగే జట్టు ఎంపిక విషయంలో కూడా హామీ ఇవ్వలేమన్నారు. ఒకసారి ఆటగాడు జాతీయ జట్టులో స్థానం కోల్పోతే..  దేశవాళీ టోర్నీల్లో రాణించి తిరిగి జట్టులో స్థానం సంపాదించుకుంటారని సెలెక్షన్ కమిటీలో సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. జట్టుకు తన సేవలు అవసరం లేదని ఒక్క మాట చెప్పి ఉంటే, ఢిల్లీలో చివరిసారి టెస్టు ఆడి వీడ్కోలు పలికేవాడినని ఓ టీవీషోలో పేర్కొన్న సెహ్వాగ్ వ్యాఖ్యలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు.
 
'వీడ్కోలు టెస్టుకు అవకాశం ఇవ్వాలా? వద్దా? అనేది సెలెక్టర్లు చేతుల్లో ఉండదు. వారి వారి ఫామ్ ను బట్టే జట్టు ఎంపిక ఉంటుంది. జట్టులో స్థానం కోల్పోయిన తరువాత తిరిగి ఫామ్ ను నిరూపించుకోలేదు. మళ్లీ జట్టులోకి వచ్చి ఉంటే మరిన్ని పరుగులు సాధించేవాడు. ఒక మంచి ఆటగాడి నుంచి ఈ రకమైన వ్యాఖ్యలు రావడం మమ్మల్ని నిరాశకు గురి చేశాయి. సెలెక్షన్ కమిటీ తీరును తప్పుబట్టినట్లు ఉంది. ప్రముఖ ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించుకున్న సెహ్వాగ్ రిటైర్మెంట్ గురించి మాకు ముందుగా ఎలా తెలుస్తుంది ' అని సెలెక్షన్ కమిటీ సభ్యుడు వ్యాఖ్యానించారు.

అయితే సెలక్షఃన్ కమిటీ స్పందనపై వీరు అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. భారత జట్టులో ఫామ్ కోల్పయి.. క్రీజులోకి వచ్చీ రాగానే.. వెనుదిరిగిపోతున్న క్రీడాకారులను ఎంపిక చేస్తున్న సెలక్టర్లు.. వీరుకు ఒక్క అవకాశం ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అయిన వారికి అకుల్లో వడ్డిస్తున్న సెలక్టర్లు.. కాని వారికి కంచాల్లో వడ్డిస్తున్నట్లు వుందని సందేహాలను వ్యక్తం చేశారు. దేశం కోసం ఆడిన వీరు ఎన్నడూ నోటీ దురుసుకు పాల్పడలేదని, అలాంటి అయన తన అభిమతాన్ని వ్యక్తం చేస్తే.. సెలక్టర్లు ఇంతలా ప్రతిస్పందిస్తారా..? అంటూ నిలదీస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  farewell Test match  bcci selectors  Cricket  

Other Articles