I am worried about verdict in my court cases

I am worried about verdict in my court cases

Salman Khan, salman Khan on cases, salman khan in Jail, Salman Khan new film promotion, Salman Khan on his cases, Salman Khans Prem Ratan Dhan Payo, Salmans news, Salman Khan updates

For all the entertainment that he provides to millions of people in India and abroad, Bollywood superstar Salman Khan rarely has any space for entertainment or happiness in his personal life. The superstar is a worried man today courtesy his legal cases. Opening up like never before, Salman Khan revealed the turmoil that is churning underneath him while he awaits the court verdict in his legal cases.

ప్రశాంతత లేదట.. కేసుల మీద సల్మాన్ కలవరం

Posted: 11/02/2015 04:23 PM IST
I am worried about verdict in my court cases

సల్మాన్ ఖాన్ కోర్టు కేసుల మీద మొదటిసారిగా మాట్లాడారు. మూడు కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న సల్మాన ఖాన్ తన గురించి, తన కేసుల గురించి నోరు విప్పారు. నిజానికి తాను కోర్టు కేసుల్లో చిక్కుకొని బాధపడుతుంటే.. అందరూ మాత్రం వేరేలా మాట్లాడుతున్నారని సల్మాన్ అన్నారు. జాక్వెలిన్ తో కలిసి రొమాన్స్ చేస్తున్నారని.. అలాగే సోనమ్ కపూర్ తో డ్యాన్స్ చేస్తున్నారని ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. కోర్ట్ కేసుల వల్ల తన తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారని.. అలాగే తాను చేసిన మంచి పనుల గురించి ఎవరూ పట్టించుకోరని కూడా సల్మాన్ వివరించారు. సల్మాన్ కొత్త సినిమా ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో కేసుల మీద తన మనసులో మాట విప్పారు.

ఎన్ని సినిమాలు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లుగా నిలుస్తున్నా కానీ తనకు మాత్రం అవేవీ మానసిక ప్రశాంతతను తీసుకురావడం లేదని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. తనకు సంబందించిన వివిధ కేసుల్లో తీర్పులెలా ఉంటాయో. 5 ఏళ్ల చొప్పున కలుపుకుంటూ పోతే 10-15 ఏళ్లు అవుతుంది. మా అమ్మానాన్నలకు, నాకు అదే పెద్ద ఆందోళన. అది మేజిస్ట్రేట్ కోర్టులో కాదు. హైకోర్టులో ఉంది. కోర్ట్ తీర్సు తర్వాత నా జీవితం ఎలా ఉండాలో అలా ఉంటుంది. సల్మాన్‌పై ప్రస్తుతం మూడు కేసులు ఉన్నాయి. కారుతో ఢీకొట్టి, పరారవడం, కృష్ణ జింకల వేట, అక్రమాయుధాలు కలిగి ఉండటం తదితర ఆరోపణలపై విచారణ జరుగుతోంది. పరిస్థితి ఎలా ఉన్నా కానీ తాను మాత్రం యాక్టర్ గా అన్నీ చెయ్యాల్సి వస్తోందని.. తన అమ్మానాన్నలు మానసికంగా ఎలాంటి ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొంటున్నారో చూడండి" అన్నాడు సల్మాన్‌. కృష్ణ జింకల కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. కానీ ఉన్నత న్యాయస్థానం స్టే విధించి, ఊరటనిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman Khan  Salman Khan cases  Prem Ratan Dhan Payo  

Other Articles