TSRTC distributing sweet boxes to drivers

Tsrtc distributing sweet boxes to drivers

TSRTC, Sweets, Dasara, Sweets to Drivers, Telanagna

TRSRTC got record level profit on dasara festival. TSRTC Decided to celebrate the profit by distribute sweets to drivers who worked for RTC

ఆర్టీసీ డ్రైవర్లకు స్వీట్లు

Posted: 10/31/2015 01:14 PM IST
Tsrtc distributing sweet boxes to drivers

ఆనందాన్ని షేర్ చెయ్యడానికి స్వీట్లను పంచడం మామూలే. అయితే తాజాగా తెలంగాణ ఆర్టీసీ తమ ఉద్యోగులకు స్వీట్లు పంచాలని నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులతో పాటుగా అద్దె బస్సలు డ్రైవర్లకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా స్వీట్లు పంచాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకు ఇలా అనుకుంటున్నారా..? మొన్నటి దసరా ఎఫ్టెక్ట్ వల్ల ఆర్టీసీ కార్మికులకు స్వీట్ బాక్స్ లు రానున్నాయి.

దసరా పండగ నేపథ్యంలో ఈ నెల 26న ఆర్టీసీ చరిత్రలోనే అత్యధిక రాబడిని ఆర్జించినందున సంస్థలో పనిచేస్తున్న ప్రతిఒక్కరినీ గౌరవించాలని యాజమాన్యం భావించింది. 26న టీఎస్ ఆర్టీసీ 19.67కోట్లు రాబడిని సాధించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని డిపోల్లోని రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులకు, అద్దెబస్సుల డ్రైవర్లకు 30 రూపాయల విలువైన స్వీట్లను అందించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సంస్థల్లో మొత్తం 76 వేల మంది పనిచేస్తున్నారు. వీరందరికీ మిఠాయిలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఈడీలకు, రీజినల్ మేనేజర్లకు ఆపరేషన్స్ అండ్ ఎంఐఎస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC  Sweets  Dasara  Sweets to Drivers  Telanagna  

Other Articles