third phase elections in BIhar today

Third phase elections in bihar today

BIhar, Elections, 3rd Phase eelctions, Nitesh Kumar, Modi, Lalu prasad

After a short festive break, the battle of Bihar returns with polling for 50 Assembly seats on Wednesday. Voting on the 50 seats would be keenly watched as it would witness battle of ballots in Mahua and Raghopur from where the two sons of RJD president Lalu Prasad are in the field.

బీహార్ లో నేడు మూడో విడత ఎన్నికలు

Posted: 10/28/2015 07:56 AM IST
Third phase elections in bihar today

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోదశ పోలింగ్ నేడు జరుగుతున్నాయి. ఆరు జిల్లాల్లో పరిధిలోని 50 నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న పోలింగ్‌లో మాహువా, రాఘోపూర్‌ల నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ అధ్యక్షుడి ఇద్దరు కుమారుల భవితవ్యంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. రాజకీయంగా లాలూకు పట్టున్న శరణ్ జిల్లాలో 10, సీఎం నితీశ్‌కుమార్ సొంత జిల్లాలోని ఏడు స్థానాలు ఉన్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇద్దరు కుమారులు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వి ప్రసాద్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మహాకూటమి, ఎన్డీఎ కూటమి మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది. ఈ రెండు ఫ్రంట్‌లకు చెందిన నాయకులు బీహార్‌లో హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ మూడో విడత ఎన్నికల్లో 1.45 కోట్ల మంది ఓటర్లు 808 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారని రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి (ఏసీఈవో) ఆర్ లక్ష్మణన్ తెలిపారు. వీరిలో 71 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. లాలూ కుమారులు తేజ్‌ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్‌ లతో పాటు రాష్ట్రమంత్రులు శ్యామ్ రజాక్ (ఫుల్వారి), శ్రవణ్‌కుమార్ (నలంద), అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అమరేంద్రప్రతాప్‌సింగ్ (ఆరా), బీజేపీ నేత నంద్‌కిశోర్‌యాదవ్ (పాట్నా సాహిబ్), అసెంబ్లీలో బీజేపీ చీఫ్‌విప్ అరుణ్‌కుమార్ సిన్హా (కుమ్‌ హ్రార్) పోటీలో ఉన్న ప్రముఖులు. 14,170 పోలింగ్ కేంద్రాల పరిధిలో 6747 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం కాగా, 1909 బూత్‌లు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని ఏసీఈవో లక్ష్మణన్ తెలిపారు. 716 పోలింగ్ బూత్‌ల పరిధిలో లైవ్ వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BIhar  Elections  3rd Phase eelctions  Nitesh Kumar  Modi  Lalu prasad  

Other Articles