TDP President got double shock from TTDP

Tdp president got double shock from ttdp

TTDP, TDP, Chandrababu Naidu, Telanagana TDP, Revanth Reddy, Errabelli Dayakar Rao, Gundu SUdha Rani

TDP President got double shock from TTDP. TDP President and AP cm Chandrababu Naidu got double shock from Telangana telugudesam party. Telanagana TDP senior leader Errabelli and TDP firebrand Revanth Reddy fired on each other.

చంద్రబాబుకు టిటిడిపి డబుల్ షాక్

Posted: 10/27/2015 04:44 PM IST
Tdp president got double shock from ttdp

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే గడ్డు కాలం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీనే టార్గెట్ గా టిఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబు నాయుడును వీలైన ప్రతీసారి టిఆర్ఎస్ నాయకులు ఏకిపారేస్తున్నారు. తాజాగా వరంగల్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబుకు షాక్ ల మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే తెలంగాణ టీడీపీలో నేతల మధ్య తగవులతో సతమతం అవుతున్నారు అధినేత చంద్రబాబు నాయుడు. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆయనకు తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేలోగానే..ఆయనకు మరో సమస్య వచ్చి పడింది. గుండు సుధారాణి చంద్రబాబుకి షాక్ ఇచ్చారు.

వరంగల్ జిల్లా నేత, టీడీపీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి కారెక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరడానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం. పార్టీలో చేరాల్సిందిగా టీఆర్ ఎస్ ఎంపీల నుంచి పిలుపు రావడంతో ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ నెల 29న గులాబీ కండువా కప్పుకోవడానికి గుండు సుధారాణి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట. వరంగల్ ఎంపీ స్థానానికి ఉపఎన్నిక వేళ గుండు సుధారాణి పార్టీ మారే వ్యవహారం పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTDP  TDP  Chandrababu Naidu  Telanagana TDP  Revanth Reddy  Errabelli Dayakar Rao  Gundu SUdha Rani  

Other Articles